News April 6, 2024
విపక్ష నేతలను బెదిరించి బీజేపీలో చేర్చుకుంటున్నారు: సోనియా
ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ మండిపడ్డారు. విపక్ష నేతలను బెదిరించి బీజేపీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. జైపూర్‌లో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు మోదీ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిని ఆదరించాలని ఓటర్లను కోరారు.
Similar News
News January 26, 2025
జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి
ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కఢ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
News January 26, 2025
యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళి
ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికుల త్యాగాలను మోదీ స్మరించుకున్నారు. ఆయన వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు ఉన్నారు. అనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
News January 26, 2025
స్వర్ణాంధ్ర విజన్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు: గవర్నర్
AP: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ నజీర్ అన్నారు. విజయవాడలో గణతంత్ర వేడుకల్లో మాట్లాడుతూ ‘గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించింది. స్వర్ణాంధ్ర విజన్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చేసింది. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే ప్రభుత్వ నినాదం’ అని వ్యాఖ్యానించారు.