News April 25, 2024
IAS గిరీశాపై విచారణకు ఆదేశం

AP: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అవకతవకల ఘటనలో సస్పెన్షన్‌కు గురై, మళ్లీ విధుల్లో చేరిన IAS గిరీశాపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌ను విచారణ అధికారిగా నియమించింది. 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న గిరీశా లాగిన్ ఐడీతో 35వేల ఓటర్ ఐడీ కార్డులు డౌన్‌లోడ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో EC ఆయన్ను జనవరిలో సస్పెండ్ చేసింది.
Similar News
News October 17, 2025
దీపావళి రోజు ఏం చేయాలంటే?

దీపావళి ముందురోజే ఇంటిల్లిపాది నూనెతో అభ్యంగన స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. ‘పండుగరోజు ఉదయమూ తలస్నానం చేయాలి. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు కాబట్టి దీపావళికి తప్పకుండా అమ్మవారిని పూజించాలి. సాయంత్రం ఇంటి ముందు ముగ్గులు వేయాలి. దీపాలు వెలిగించి, అమ్మవారికి షడ్రుచులతో వంటకాలు నివేదించాలి. పూజ పూర్తయ్యాక ఆ దీపాలను ఇంటి ముందు, తులసి కోట వద్ద అలంకరించుకోవాలి’ అని చెబుతున్నారు.
News October 17, 2025
HUDCOలో 79 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఢిల్లీలోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HUDCO) 79 మేనేజర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ/బీటెక్, CA/CMA, LLB, LLM, MBA, PG ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hudco.org.in/
News October 17, 2025
తాజా సినీ ముచ్చట్లు

*బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కంధపురి’ ఇవాళ ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది.
*ఈనెల 31న విడుదలయ్యే ‘బాహుబలి ది ఎపిక్’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి 3 గంటల 44 నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేశారు.
*ఇవాళ ‘తెలుసు కదా’, ‘డ్యూడ్’ చిత్రాలు థియేటర్లలో విడుదలయ్యాయి. దేనికి వెళ్తున్నారు?