News May 25, 2024
రఫాపై సైనిక చర్య తక్షణమే ఆపాలని ఆదేశాలు

రఫా పట్టణంపై తక్షణమే సైనిక చర్యను నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. దక్షిణ గాజాలోని పాలస్తీనియులను ఇజ్రాయెల్ బలి తీసుకుంటోందన్న దక్షిణాఫ్రికా ఫిర్యాదుపై విచారణ జరిపింది. రఫా ప్రభుత్వానికి ఆటంకం కలిగేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించింది. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రతినిధి.. హమాస్‌పై దాడులు చేయకుండా తమను ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.
Similar News
News February 20, 2025
మహా కుంభమేళాను వాడుతున్న సినీ మేకర్స్

మహా కుంభమేళా సినీజనానికి మంచి అవకాశంగా మారింది. ఇప్పటికే బాలయ్య ‘అఖండ-2’కి కొంత షూటింగ్‌ను కుంభమేళాలో తీసినట్లు సమాచారం. తాజాగా తమన్నా నాగ సాధువుగా నటిస్తున్న ‘ఓదెల-2’ ప్రమోషన్లకి కూడా కుంభమేళా వేదికగా మారింది. మూవీ టీజర్‌ను ఈ నెల 22న అక్కడే లాంఛ్ చేయనున్నట్లు వారు ఇప్పటికే ప్రకటించారు. దీంతో అటు భక్తితో పాటు ఇటు సినిమా పనిని కూడా మూవీ టీమ్స్ చక్కదిద్దుకుంటున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
News February 20, 2025
భారత్‌లోకి ఐఫోన్ 16ఈ.. ధర ఎంతంటే..

భారత్‌లో తమ మార్కెట్‌ను విస్తరించడంపై యాపిల్ కన్నేసింది. రూ.59వేలకే ఐఫోన్ 16ఈని తీసుకొస్తోంది. ఇది 128 జీబీ ఇంటర్నల్ జీబీతో రానుంది. రేపటి నుంచే అడ్వాన్స్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 నుంచి పూర్తి స్థాయి అమ్మకాలు మొదలవుతాయని యాపిల్ తెలిపింది. ఈ ఫోన్‌లో సింగిల్ కెమెరా మాత్రమే ఉండటం గమనార్హం. ఇక ఐఫోన్ SE అమ్మకాల్ని యాపిల్ భారత్‌లో ఆపేయనున్నట్లు సమాచారం.
News February 20, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ ఓడిపోయినా రోహితే కెప్టెన్: కైఫ్

‘ఛాంపియన్స్ ట్రోఫీ’ని భారత్ గెలుచుకోలేకపోయినా సరే 2027 వరల్డ్ కప్ వరకూ రోహిత్ శర్మనే భారత కెప్టెన్‌గా కొనసాగించాలని మాజీ క్రికెటర్ కైఫ్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ సాధించిన ఘనతలు అందరూ సాధించలేరు. టీమ్ ఇండియాను 2023 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేర్చారు. వన్డే ఫార్మాట్లో ఆయన ఆటను, కెప్టెన్సీని ఎవరూ ప్రశ్నించలేరు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌గా రోహిత్ గెలుపు శాతం అద్భుతం’ అని గుర్తుచేశారు.