News January 28, 2025
ABVకి వేతనం, అలవెన్సులు చెల్లించాలని ఆదేశాలు

AP: విశ్రాంత IPS AB వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. గత ప్రభుత్వం ఈయన్ను 2సార్లు సస్పెండ్ చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తొలిసారి 2020 FEB-2022 FEB 7వరకు, రెండో సారి 2022 JUN 28- మే 30 వరకు సస్పెండ్ చేయగా, ఈ కాలంలో విధులు నిర్వహించినట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ కాలానికి సంబంధించి ABVకి మొత్తం వేతనం, అలవెన్సులు చెల్లించాలని ఆదేశాలిచ్చింది.
Similar News
News December 1, 2025
చిన్న వయసులోనే టీకా ఎందుకు తీసుకోవాలంటే..?

గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంక్రమించడానికి ముందే టీకా తీసుకోవడం వల్ల అత్యధిక రక్షణ లభిస్తుంది. అందుకే, లైంగిక చర్య ప్రారంభానికి ముందే, అంటే 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సులో బాలికలకు టీకా ఇవ్వాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాలికలకే కాకుండా పురుషాంగం, పాయువు, గొంతు క్యాన్సర్ల రక్షణ కోసం బాలురు కూడా ఈ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 1, 2025
శివుడు పుర్రెల దండ ఎందుకు ధరిస్తాడు?

పరమ శివుడు పుర్రెల దండ, చితాభస్మం ధరించి శ్మశానంలో తిరుగుతుంటాడు. అందుకు కారణం శిష్టరక్షణ. అసురులు ధర్మబద్ధంగా వరాలు పొంది దేవతలను హింసించేవారు. వారిని మోహానికి గురి చేయడానికి విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు శివుడు ఈ వేషం ధరించి, పాషండ మతాన్ని ఉపదేశించాడు. దీంతో వేద నింద, దైవ నింద చేసిన రాక్షసుల తేజస్సు క్షీణించింది. అలాగే వారి నుంచి దేవతలకు ఉపశమనం లభించింది. ఇది ధర్మ రక్షణకై హరిహరులు చేసిన లీల.
News December 1, 2025
భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు

AP: రాష్ట్రంలో <<18409601>>స్క్రబ్ టైఫస్<<>> వ్యాధి కేసులు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖలో 500కు పైగా కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ లక్షణాలతో విజయనగరంలో మహిళ మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయని ఫీవర్ తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇది అంటు వ్యాధి కాదని వైద్యులు తెలిపారు.


