News January 28, 2025
ABVకి వేతనం, అలవెన్సులు చెల్లించాలని ఆదేశాలు

AP: విశ్రాంత IPS AB వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. గత ప్రభుత్వం ఈయన్ను 2సార్లు సస్పెండ్ చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తొలిసారి 2020 FEB-2022 FEB 7వరకు, రెండో సారి 2022 JUN 28- మే 30 వరకు సస్పెండ్ చేయగా, ఈ కాలంలో విధులు నిర్వహించినట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ కాలానికి సంబంధించి ABVకి మొత్తం వేతనం, అలవెన్సులు చెల్లించాలని ఆదేశాలిచ్చింది.
Similar News
News February 9, 2025
పరగడుపున వీటిని తింటున్నారా?

పరగడుపున కొన్ని ఆహార పదార్థాలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఏమీ తినకుండా నిమ్మ, నారింజ, దానిమ్మ పండ్లు తీసుకుంటే గ్యాస్ సమస్యలు వస్తాయి. ఉప్పు, కారం, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకూడదు. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు తింటే పొట్ట ఉబ్బరం, అజీర్తి కలుగుతాయి. తీపి పదార్థాలు, టీ, కాఫీ తీసుకుంటే ఎసిడిటీ వస్తుంది. ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్ తాగకూడదు. నిల్వ పచ్చళ్లు, చీజ్ తినకూడదు.
News February 9, 2025
రేపు ఆల్బెండజోల్ మందుల పంపిణీ

APలో ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 1-19 ఏళ్లలోపు ఉన్న వారికి ఆల్బెండజోల్-400 మిల్లీ గ్రాముల మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 10న హాజరు కాని వారికి 17వ తేదీన అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 6 నెలలకోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
News February 9, 2025
NRIలు, NRTS సభ్యులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు ఇకపై రోజుకు 100 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను TTD కేటాయించనుంది. అలాగే శ్రీవారి దర్శనం కోసం వచ్చే NRIలు, విదేశీయులకు సుపథం మార్గంలో రూ.300 కోటాలో దర్శనం కల్పించనుంది. స్టాంపింగ్ తేదీ నుంచి నెలలోపు దర్శనం కల్పించనుంది. ఒరిజినల్ పాస్‌పోర్టుతో ఉ.10 నుంచి సా.5 గంటలోపు వచ్చిన వారికి టోకెన్లు ఇస్తారు. బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల టైంలో టోకెన్లు ఇవ్వరు.