News April 15, 2025
SC వర్గీకరణపై 5 రోజుల్లో ఆర్డినెన్స్.. ఆ వెంటనే DSC?

AP: జాతీయ SC కమిషన్ నుంచి వర్గీకరణ డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. దీనిపై ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. 5 రోజుల్లో ఆర్డినెన్స్ విడుదల చేసి, ఆ తర్వాత 3 రోజుల్లో మార్గదర్శకాలను వెల్లడించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే వారంలో విద్యాశాఖ మెగా DSC నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశముంది. జూన్ నాటికి 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని CM CBN ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News April 16, 2025
వైఎస్ జగన్‌కు టీడీపీ సవాల్

AP: టీటీడీ గోశాలలో గోవులు పెద్దఎత్తున మరణించాయనే ప్రచారంపై TDP ఘాటుగా స్పందించింది. వైసీపీ చీఫ్ జగన్, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రేపు తిరుమలకు రావాలని Xలో ఛాలెంజ్ చేసింది. గోశాలలో గోమాతలు ఎలా ఉన్నాయో కళ్లారా చూడాలంది. రేపు ఉ.10 గంటలకు లైవ్ ఇస్తామని పేర్కొంది.
News April 16, 2025
NEET-PG నోటిఫికేషన్ విడుదల

వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష NEET-PG <
News April 16, 2025
పీఎం ఇంటర్న్‌షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు

పీఎం ఇంటర్న్‌షిప్ స్కీం దరఖాస్తుల గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఈనెల 22 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఈ స్కీంలో భాగంగా నిరుద్యోగ యువతకు దేశంలోని 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తుంది. ఏడాది పాటు నెలకు రూ.5 వేల చొప్పున డైరెక్ట్‌గా అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. https://pminternship.mca.gov.in/login/ సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. 21-24 ఏళ్లవారు అర్హులు.