News April 15, 2025
SC వర్గీకరణపై 5 రోజుల్లో ఆర్డినెన్స్.. ఆ వెంటనే DSC?

AP: జాతీయ SC కమిషన్ నుంచి వర్గీకరణ డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. దీనిపై ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. 5 రోజుల్లో ఆర్డినెన్స్ విడుదల చేసి, ఆ తర్వాత 3 రోజుల్లో మార్గదర్శకాలను వెల్లడించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే వారంలో విద్యాశాఖ మెగా DSC నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశముంది. జూన్ నాటికి 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని CM CBN ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News April 25, 2025
BRS సభకు వెళ్లకండి: RTC జేఏసీ

TG: తమ హయాంలో RTC కార్మికులకు అన్యాయం చేసిన BRS ఇప్పుడు వారిని పార్టీ సభకు రావాలని ఎలా పిలుస్తోందని RTC జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామ రెడ్డి ఫైరయ్యారు. కార్మికులు 55రోజులు సమ్మె చేస్తే 34మంది ప్రాణాలు కోల్పోయారని ఆ విషయాన్ని ఉద్యోగులు మర్చిపోలేదన్నారు. 10ఏళ్ల పాలనలో ఒక్క రిక్రూట్ మెంట్ లేదని గుర్తుచేశారు. ఏప్రిల్ 27న జరిగే BRS సభకు కార్మికులెవరూ వెళ్లొద్దని జేఎసీ నేతలు సూచించారు.
News April 25, 2025
బెట్టింగ్ యాప్‌లపై విచారణ.. మెట్రో ఎండీకి నోటీసులు

TG: హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ ప్రకటనలపై దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం బెట్టింగ్ యాప్‌లను నిషేధించినా మెట్రో రైళ్లలో ప్రకటనలు రావడంపై కోర్టు మండిపడింది. ఆ ప్రకటనలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ మెట్రో ఎండీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి దర్యాప్తు జరగాల్సి ఉందని పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
News April 25, 2025
నేడు ఢిల్లీకి సీఎం.. PMకు ‘అమరావతి’ ఆహ్వానం

AP: సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మే 2న అమరావతి పనుల పున:ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని ఆయన ఆహ్వానిస్తారు. సాయంత్రం తిరుగు ప్రయాణమై రాత్రి 9 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.