News November 16, 2024
‘మా దేవుడు పవన్.. మా పాలిట రాక్షసుడు మూర్తి’
AP: విశాఖలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ తమను వేధిస్తున్నారంటూ చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. నిబంధనల ప్రకారం వ్యాపారాలు చేసుకుంటున్నా డబ్బు కోసం అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఓటేసి గెలిపించుకున్నందుకు తగిన శాస్తి జరిగిందని వాపోయారు. ‘మా దేవుడు పవన్ కళ్యాణ్.. మా పాలిట రాక్షసుడు పీతల మూర్తి’ అనే ఫ్లెక్సీని ప్రదర్శించారు. అతని ఫొటోను చెప్పుతో కొట్టి నిరసన తెలిపారు.
Similar News
News December 7, 2024
పుష్ప-2: రెండు రోజుల్లో రూ.449 కోట్ల వసూళ్లు
‘పుష్ప-2’ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.449 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మైల్‌స్టోన్‌ను అతి వేగంగా చేరుకున్న సినిమాగా రికార్డు సృష్టించిందని తెలిపింది. తొలి రోజు రూ.294కోట్ల కలెక్షన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. బుక్ మై షోలో ఈ సినిమా టికెట్లు గంటకు లక్షకుపైగా అమ్ముడవడం గమనార్హం. మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.
News December 7, 2024
ఇక ఇండియా కూటమికి కాలం చెల్లినట్టేనా..!
INDIA కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా కాంగ్రెస్‌కు దూరమవుతున్నాయి. మమతకు బాధ్యతలు ఇవ్వాలని SP పట్టుబడుతోంది. అదానీ వ్యవహారంలో INC ఆందోళనలకు SP, TMC దూరంగా ఉన్నాయి. ఆప్ ఇప్పటికే ఢిల్లీలో దూరం జరిగింది. MH, హరియాణాలో తమను లెక్కలోకి తీసుకోలేదని వామపక్షాలు గుర్రుగా ఉన్నాయి. లాలూ ప్రసాద్‌కు బాధ్యతలు ఇవ్వాలని అటు RJD కోరుతోంది. మీ అభిప్రాయమేంటి?
News December 7, 2024
మొబైల్ డేటా, వైఫై ఏది వాడితే మంచిది?
మొబైల్ డేటా కంటే వైఫైతో ఇంటర్నెట్ వాడుకోవడం బ్యాటరీకి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ డేటా ఉపయోగిస్తే సిగ్నల్ కోసం వెతుకుతూ ఫోన్ ఎక్కువ ప్రాసెసింగ్ చేస్తుందని, దీనివల్ల బ్యాటరీ త్వరగా ఖర్చవుతుందంటున్నారు. అలాగే 3G, 4G, 5G నెట్వర్క్స్ మధ్య స్విచ్ అవడం వల్ల బ్యాటరీ ఫాస్ట్‌గా డ్రెయిన్ అవుతుంది. వైఫై సిగ్నల్ స్ట్రాంగ్, స్థిరంగా ఉంటుందని దీనివల్ల తక్కువ పవర్ అవసరం పడుతుందని పేర్కొంటున్నారు.