News April 1, 2025
మా ప్రభుత్వం రూ.వేల కోట్ల భూమిని కాపాడింది: భట్టి

TG: కంచ గచ్చిబౌలిలోని ₹వేల కోట్ల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తాము కాపాడామని Dy.CM భట్టి తెలిపారు. ‘400 ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం 2004లో IMG భారత్కు కేటాయిస్తే, 2006లో YSR ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో IMG భారత్ కోర్టుకు వెళ్లింది. అప్పటినుంచి కేసు కోర్టులోనే ఉంది. పదేళ్లుగా BRS కూడా పట్టించుకోలేదు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని చూసింది’ అని ఆరోపించారు.
Similar News
News November 18, 2025
కొండెక్కిన ‘కోడిగుడ్డు’

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలతో పాటు కోడి గుడ్ల రేట్లు కూడా కొండెక్కుతున్నాయి. కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల సమయంలో వినియోగం తగ్గినా రేటు పైపైకి వెళ్తోంది. జూన్లో ఫారం వద్ద ఒక్కో ఎగ్ ధర ₹4.60 ఉండగా, రిటైల్ మార్కెట్లో ₹5.50 పలికింది. ఇప్పుడు ఫారంలో ₹6కు, రిటైల్లో ₹7కు చేరింది. పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చు పెరగడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

BIG ALERT: మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందంటూ వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నారు. SBI లోగోను డీపీగా పెట్టుకుని APK ఫైల్స్ను పంపుతున్నారు. దీన్ని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే SBI అలాంటి ఫైల్స్ను ఎప్పుడూ పంపదని, వాటిని క్లిక్ చేయొద్దని PIB Fact Check స్పష్టం చేసింది.
#ShareIt