News April 6, 2024
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: హరీశ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1712402888637-normal-WIFI.webp)
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోతున్నాయని, తెలంగాణలోనూ అదే జరుగుతుందని BRS నేత హరీశ్ రావు అన్నారు. ‘మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం’ అని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఊపు తగ్గిందని, అరచేతిలో వైకుంఠం చూపించి హామీలను అమలు చేయట్లేదని విమర్శించారు. కార్యకర్తలు అక్రమ కేసులకు భయపడొద్దని, అవసరమైతే తమ ప్రాణాలను అడ్డుపెట్టి కాపాడుకుంటామని తెలిపారు.
Similar News
News January 14, 2025
పసుపు బోర్డుతో రైతుల కల నెరవేరింది: బండి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1735672916360_1045-normal-WIFI.webp)
TG: నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుతో పండగ రోజు రైతుల కల నెరవేరిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. దీని ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నట్లు చెప్పారు. ఎంపీ అర్వింద్ పట్టుదలతో తన హామీ నెరవేర్చుకున్నారని చెప్పారు. రైతుల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి రైతులు తమ ఆశీర్వాదం అందించాలని బండి కోరారు.
News January 14, 2025
నలుగురు పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్టు: CBN
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736857443242_653-normal-WIFI.webp)
AP: మనదేశానికి జనాభే అతిపెద్ద ఆదాయ వనరు అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఒకప్పుడు నేను పాపులేషన్ కంట్రోల్ అని చెప్పా. కానీ ఇప్పుడు పాపులేషన్ మేనేజ్‌మెంట్ అని చెబుతున్నా. పిల్లలే మీ ఆస్తి. నలుగురు పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్టు. జపాన్, సౌత్ కొరియా తదితర దేశాల్లో యువత లేక మనవాళ్లను అడుగుతున్నారు. ఇటీవల MP ప్రభుత్వం కూడా నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించింది’ అని CBN తెలిపారు.
News January 14, 2025
‘ప్లేయర్ ఆఫ్ ది డిసెంబర్’గా బుమ్రా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736856165428_695-normal-WIFI.webp)
BGTలో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైన స్టార్ బౌలర్ బుమ్రా మరో ఘనత సాధించారు. డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును సొంతం చేసుకున్నారు. గత నెలలో 3 మ్యాచ్‌లలోనే బుమ్రా 22 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. మహిళల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నారు.