News December 6, 2024

రేపు వచ్చేది మా ప్రభుత్వమే.. ఊరుకోం: పల్లా

image

TG: అక్రమ అరెస్టులకు భయపడేది లేదని BRS నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ‘పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ తీరు సరిగా లేదని మా మాజీ మంత్రులు, నేతలు ఆయన్ను కలవడానికి వెళ్లాం. చట్టాలు ఉల్లంఘించి మమ్మల్ని అరెస్ట్ చేసి అనేక స్టేషన్లు తిప్పారు. రేపు వచ్చే ప్రభుత్వం మాదే. మీ అక్రమాలు సహించం’ అని పల్లా అన్నారు. నార్సింగి PS వద్దకు భారీగా BRS శ్రేణులు చేరుకోగా, అర్ధరాత్రి పల్లాను పోలీసులు విడుదల చేశారు.

Similar News

News January 17, 2025

విరాట్ కోహ్లీకి గాయం!.. రంజీల్లో ఆడతాడా?

image

విరాట్ కోహ్లీ మెడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. దీనికి ఇంజెక్షన్ కూడా తీసుకున్నారని, రంజీ ట్రోఫీలో ఆయన ఆడటంపై సందిగ్ధత నెలకొందని పేర్కొన్నాయి. ఆయన ఢిల్లీ టీమ్‌తో ట్రావెల్ అవుతారని, పూర్తిగా కోలుకుంటేనే ఆడతారని తెలుస్తోంది. గాయం నుంచి కోలుకోకుంటే ప్రాక్టీస్‌కు మాత్రమే పరిమితం కానున్నారు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండటంతో ఈ వార్త ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.

News January 17, 2025

ACCIDENT: 9 మంది దుర్మరణం

image

మహారాష్ట్రలోని నాసిక్-పుణే హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఐచర్ ప్యాసింజర్లతో వెళ్తోన్న మాక్సిమోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మాక్సిమో ముందున్న బస్సును ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం ధాటికి మాక్సిమో నుజ్జునుజ్జయింది. పుణే సమీపంలోని నారాయణ్‌గావ్ రోడ్డుపై ఈ యాక్సిడెంట్ అయింది.

News January 17, 2025

ఆర్థిక వ్యవస్థలో అమెరికాను దాటనున్న ఇండియా!

image

రానున్న 50 ఏళ్లలో ఇండియా జీడీపీ భారీగా పెరుగుతుందని ‘గోల్డ్‌మన్ సాక్స్’ అంచనా వేసింది. 2075 నాటికి ఇండియా $52.5 ట్రిలియన్‌తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. $57 ట్రిలియన్‌తో చైనా జీడీపీలో నంబర్ 1గా మారనుందని తెలిపింది. కాగా, మూడో స్థానంలో USA ($51.5 ట్రిలియన్‌), నాలుగో ప్లేస్‌లో ఇండోనేషియా ($13.7ట్రి), ఐదో స్థానంలో నైజీరియా ($13.1ట్రి) ఉంటాయని వెల్లడించింది.