News April 6, 2024

మాది మిషన్.. విపక్షాలది కమీషన్: మోదీ

image

ఇండియా కూటమి కమీషన్ల కోసమే అధికారం కోరుకుంటోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఓ మిషన్ కోసం పనిచేస్తోందని చెప్పారు. యూపీలోని షహరాన్‌పూర్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. ముస్లిం లీగ్, వామపక్ష భావజాలం కలిగిన వారి ముద్ర మేనిఫెస్టోలో కనిపిస్తోందన్నారు. అనిశ్చితి, అస్థిరతకు పర్యాయపదంగా ఇండియా కూటమి తయారైందని ఎద్దేవా చేశారు.

Similar News

News January 10, 2026

బీపీ తగ్గాలంటే ఇవి తినాలి

image

హైబీపీకి ఎన్నో కారణాలుంటాయి. దాన్ని అదుపులో ఉంచుకోకపోతే అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే పొట్టుతో ఉన్న గింజధాన్యాలతోపాటు ఆకుకూరలు, కాయగూరలు, అల్లం, వెల్లుల్లి వంటివి తీసుకోవాలి. రైస్‌బ్రాన్, నువ్వులు, ఆవ నూనెల్ని నాలుగైదు చెంచాలకు మించి వాడకూడదు. సలాడ్స్‌, నాటుకోడి, చేప తినొచ్చు. వీటితో పాటు ఒత్తిడినీ నియంత్రించుకోగలిగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.

News January 10, 2026

మెడ నలుపు తగ్గాలంటే?

image

హార్మోన్ల మార్పులు, కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల మెడ నల్లగా మారుతుంది. దీన్ని తొలగించడానికి ఈ చిట్కాలు. * పెరుగు, నిమ్మరసం కలిపి మెడకు రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. * పసుపు, పాలు కలిపి మెడకి అప్లై చేయాలి. దీన్ని 20నిమిషాల తర్వాత కడిగేయాలి. * అలోవెరాజెల్‌‌, కాఫీపొడి, పసుపు కలిపి మెడకి రాసి, ఆరాక నీటితో స్క్రబ్ చేయాలి. మరిన్ని స్కిన్, హెయిర్ కేర్ టిప్స్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.

News January 10, 2026

నేడు ఇవి దానం చేస్తే?

image

పుష్య మాస శనివారాల్లో చేసే దానం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. చలి తీవ్రంగా ఉండే ఈ మాసంలో పేదలకు కంబళ్లు, దుప్పట్లు, వస్త్రాలను దానం చేయాలి. ఇవేకాక నల్ల నువ్వులు, బెల్లం, నూనె దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహంతో జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ పవిత్ర మాసంలో స్నాన, జప, తపాదులతో పాటు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభించి కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. పరులకు చేసే సాయమే దేవుడికి చేరే నిజమైన పూజ.