News March 28, 2025
మా జట్టు ఓపెనర్లపై ఆధారపడలేదు: క్లాసెన్

తమ జట్టు ఓపెనర్లపై ఆధారపడదని SRH బ్యాటర్ క్లాసెన్ తెలిపారు. ‘హెడ్, అభిషేక్ మాకు అదిరిపోయే ఆరంభాల్ని ఇస్తున్నారు. అలా అని మేం వారిపైనే ఆధారపడలేదు. మా లైనప్ చూడండి. 8వ నంబర్ బ్యాటర్ వరకూ విధ్వంసకరంగానే ఆడతారు. కాబట్టి ఓపెనర్లు ఎలా ఆడినా సమస్య లేదు. మేం ఆడేదే రిస్కీ ఆట. నిన్నటి మ్యాచ్‌లో ఒకట్రెండు వికెట్లు దురదృష్టవశాత్తూ కోల్పోయాం. లేదంటే ఆ పిచ్‌పై కనీసం 220 స్కోర్ చేయాల్సింది’ అని వివరించారు.
Similar News
News March 31, 2025
కొడాలి నాని హెల్త్ అప్‌డేట్

వైసీపీ నేత కొడాలి నాని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారం క్రితం ఛాతినొప్పితో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారించారు. స్టెంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. సర్జరీ కోసం కొంత సమయం తీసుకోవాలని కుటుంబసభ్యులు యోచిస్తున్నారు. నానిని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించే అవకాశం ఉంది.
News March 31, 2025
సంచలనం.. ‘మ్యాడ్ స్క్వేర్’ భారీ కలెక్షన్లు

‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ కలెక్షన్లలో అదరగొడుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.55.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. మ్యాడ్ గ్యాంగ్ చేసే కామెడీకి ప్రేక్షకుల గోలతో థియేటర్లు షేక్ అవుతున్నాయని పేర్కొంది. కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు కీలక పాత్రలు పోషించారు.
News March 31, 2025
హెడ్‌కు స్టార్క్ దెబ్బ

SRH స్టార్ బ్యాటర్ హెడ్‌కు స్టార్క్ పీడకలలా మారారు. టాప్ లెవెల్ క్రికెట్లో స్టార్క్.. హెడ్‌ను 8 ఇన్నింగ్సుల్లో 6 సార్లు ఔట్ చేశారు. 34 బంతులు వేసి 18 రన్స్ మాత్రమే ఇచ్చారు. తన భయంతోనే హెడ్ ఫస్ట్ బాల్ స్ట్రైక్ తీసుకోలేదని నిన్న మ్యాచ్ అనంతరం స్టార్క్ సరదాగా వ్యాఖ్యానించారు. కాగా నిన్న SRHపై స్టార్క్ 5 వికెట్లు పడగొట్టి MOMగా నిలిచారు. గతేడాది క్వాలిఫైయర్-1, ఫైనల్లో స్టార్క్ SRHను దెబ్బకొట్టారు.