News September 24, 2024
మా యుద్ధం హెజ్‌బొల్లాతోనే.. మీతో కాదు: నెతన్యాహు
తమ యుద్ధం హెజ్‌బొల్లాతోనేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. హెజ్‌బొల్లాకు లెబనాన్ పౌరులు మానవ కవచాలుగా మారొద్దని సూచించారు. ‘కొన్నేళ్లుగా హెజ్‌బొల్లా మీ ఇళ్లలో రాకెట్లు, క్షిపణులు దాచిపెడుతోంది. వీటితో మా దేశ ప్రజలపైకి దాడులకు పాల్పడుతోంది. మా ప్రజలను రక్షించుకోవడం కోసం దాడులు చేయక తప్పడం లేదు. యుద్ధం ముగిసేవరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలు దక్కించుకోండి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.
Similar News
News October 15, 2024
సీనియర్‌గా మంత్రి పదవి ఆశిస్తున్నా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్
TG: కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌గా తాను మంత్రి పదవి ఆశిస్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చెప్పారు. పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మహేశ్ గౌడ్‌కు పీసీసీ చీఫ్ పదవి అదే ప్రాతిపదికన ఇచ్చారని పేర్కొన్నారు. అయితే దీనిపై అంతిమ నిర్ణయం హైకమాండ్‌దేనని స్పష్టం చేశారు. పైరవీలతో మంత్రి పదవులు ఇవ్వరన్నారు.
News October 15, 2024
హైకోర్టు జడ్జిలుగా ముగ్గురు లాయర్ల పేర్లు సిఫారసు
AP: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు లాయర్ల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వారిలో కుంచం మహేశ్వరరావు, టి.చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్ ఉన్నారు. ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపిన తర్వాత ఉత్తర్వులు వెలువడనున్నాయి.
News October 15, 2024
కోహ్లీ.. మరో 53 పరుగులు చేస్తే
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయికి చేరువయ్యారు. రేపటి నుంచి న్యూజిలాండ్‌తో జరిగే టెస్టులో మరో 53 పరుగులు చేస్తే 9వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకోనున్నారు. దీంతో భారత జట్టు తరఫున టెస్టుల్లో 9వేల పరుగులు చేసిన నాలుగో ప్లేయర్‌గా నిలవనున్నారు. ఈ లిస్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 15,921 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు 115 టెస్టులు ఆడిన కోహ్లీ 8,947 పరుగులు చేశారు.