News November 3, 2024
ప్రతి లక్షలో 60 వేల మందికి అప్పులే
AP: రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి లక్ష మందిలో 60,092 మందికి అప్పులు ఉన్నట్లు కేంద్ర గణాంక శాఖ చేపట్టిన శాంపిల్ సర్వేలో తేలింది. దేశంలో ప్రతి లక్ష మందిలో 18,322 మందికి అప్పులు ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోనే అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రం APనేనని తెలిపింది. TGలో ప్రతి లక్ష మందిలో 54,538 మందికి అప్పులున్నట్లు తెలిపింది. అత్యల్పంగా గోవాలో ప్రతి లక్ష మందిలో 2,317 మందికే రుణాలు ఉన్నట్లు పేర్కొంది.
Similar News
News December 4, 2024
3 లక్షల ఏళ్ల క్రితం నాటి మానవ పుర్రె
3లక్షల ఏళ్లకంటే పురాతనమైన మానవ అవశేషాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనా హవాయి విశ్వవిద్యాలయం కాలేజీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లోని మనోవా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ జె. బే వీటిని కనిపెట్టారు. ఆయన 30 ఏళ్లుగా ఆసియా అంతటా మానవ పూర్వీకులపై అధ్యయనం చేశారు. ఫలితంగా హోమో జులుయెన్సిస్ అనే పురాతన మానవ జాతిని గుర్తించారు. పెద్ద పుర్రె ఆధారంగా వీరి తలలు పెద్దగా ఉంటాయని తెలిపారు.
News December 4, 2024
రాహుల్ బయటేం చేస్తున్నారు?: LS ప్యానెల్ స్పీకర్
యూపీలోని సంభల్‌కు వెళ్తున్న రాహుల్ గాంధీని పోలీసులు <<14786784>>అడ్డుకోవడాన్ని<<>> కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే అంశాన్ని ఆ పార్టీ ఎంపీ మహ్మద్ జావెద్ లోక్‌సభలో లేవనెత్తారు. ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ప్యానెల్ స్పీకర్ జగదాంబికా పాల్ ‘ఇక్కడ పార్లమెంట్ సెషన్ నడుస్తుంటే రాహుల్ బయటేం చేస్తున్నారు? ఆయన సమావేశాలకు హాజరవ్వాలి కదా?’ అని కౌంటర్ ఇచ్చారు.
News December 4, 2024
KCRపై కోపంతో CM అలా చేస్తున్నారు: KTR
TG: KCRపై కోపంతో CM రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చుతున్నారని KTR అన్నారు. ‘మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని KCR ఏర్పాటు చేయించారు. దానిని మార్చవద్దని CMకి చెబుతున్నా. ఇందిరా గాంధీ పెట్టిన భరత మాత విగ్రహాన్ని వాజపేయీ మార్చలేదు. రేవంత్ ఆటలు ఎల్లకాలం సాగవు. రాజీవ్ విగ్రహం ఉన్న చోటే భవిష్యత్తులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యానించారు.