News March 29, 2025
OUలో రివాల్యుయేషన్‌కు అవకాశం

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఏ లాంగ్వేజెస్ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. బీఏ లాంగ్వేజెస్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. ఈ రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపరుకు రూ.500 చొప్పున చెల్లించి వచ్చే నెల 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 2, 2025
కొత్త ఛేజ్ మాస్టర్ వచ్చేశాడు!

PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్య ఛేదనలో సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకున్నారు. నిన్న LSG మ్యాచ్(52*)తో కలిపి 2023 నుంచి IPLలో 6సార్లు ఛేజింగ్ చేస్తూ నాటౌట్‌గా నిలిచారు. గతేడాది KKRకు కప్ అందించిన అయ్యర్‌కు వేలంలో రూ.26.75cr దక్కాయి. ఈ క్రమంలో అతనిపై భారీగా అంచనాలు పెరగ్గా.. అందుకు తగ్గట్లుగానే ఓ వైపు కెప్టెన్సీ చేస్తూ, మరోవైపు కోహ్లీ వారసత్వాన్ని తీసుకొని కొత్త ఛేజ్ మాస్టర్ అవతారమెత్తారు.
News April 2, 2025
మెదక్: విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

మనోహరాబాద్(M) కొండాపూర్ పారిశ్రామికవాడలో శ్రీహన్ పాలిమర్ కంపెనీలో మధ్యప్రదేశ్(S) అనుపూరు జిల్లా బలియా గ్రామానికి చెందిన రఘునాథ్ సింగ్(21) అనే కార్మికుడు మృతిచెందాడు. మంగళవారం ఉదయం విధులు నిర్వహిస్తుండగా మిషన్‌కు చెందిన వైర్ తగలడంతో షాక్‌కు గురై చనిపోయాడు. యజమాని నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి సోదరుడు ఆరోపించాడు. మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News April 2, 2025
కర్నూలు జిల్లాకు వర్ష సూచన

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ (APSDMA) పేర్కొంది. కాబట్టి రైతులు, కూలీలు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అంతే కాకుండా వర్షాలు పడే సమయంలో, రైతులు పొలాల్లోని చెట్ల కింద ఉండరాదని, వాతావరణంలో మార్పులు రాగానే ఇళ్లకు చేరుకోవాలని తెలిపింది.