News June 12, 2024
ఎన్నికల వేళ హెలికాప్టర్లతో 1000 గంటలకుపైగా సేవలు: వాయుసేన

సార్వత్రిక ఎన్నికల సమయంలో తమ హెలికాప్టర్లతో దేశవ్యాప్తంగా 1750 ప్రదేశాల్లో 1000 గంటలకు పైగా సేవలందించామని వాయుసేన వెల్లడించింది. ఈ సేవలకు తేలికపాటి చేతక్, ALH ధ్రువ్, ఎంఐ-17 మీడియం లిఫ్ట్ హెలికాప్టర్లను విస్తృతంగా ఉపయోగించినట్లు పేర్కొంది. పోలింగ్‌కు ముందు మారుమూల ప్రాంతాలకు ఎన్నికల సిబ్బంది, సామగ్రిని తరలించడం, తిరిగి తీసుకురావడం సవాలుతో కూడుకున్నదని తెలిపింది.
Similar News
News October 25, 2025
విడుదలకు సిద్ధమైన ‘మాస్ జాతర’.. రన్‌టైమ్ ఇదే

రవితేజ-శ్రీలీల ‘మాస్ జాతర’ రన్‌టైమ్ లాక్ అయింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2 గంటల 40 నిమిషాల నిడివి ఉంది. అలాగే సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాలను వెల్లడిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘మాస్, ఫన్ అండ్ యాక్షన్ అన్నీ ఒకదాంట్లోనే. ఎంటర్టైన్మెంట్ మాస్‌వేవ్‌ను థియేటర్లలో ఆస్వాదించండి’ అని పేర్కొన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ OCT 31న రిలీజ్ కానుంది.
News October 25, 2025
అర్ధరాత్రి లోపు అప్డేట్ చేయకపోతే జీతాలు రావు: ఆర్థిక శాఖ

TG: అక్టోబర్ నెల వేతనాలను ఆధార్‌తో లింక్ అయి ఉన్న <<18038300>>ఉద్యోగులకే<<>> ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారు. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్‌లో ఆధార్ లింక్ చేయాలని డెడ్‌లైన్ విధించింది. ఆధార్‌తో లింక్ కాని ఉద్యోగులకు జీతాలు జమ కావని స్పష్టంచేశారు.
News October 25, 2025
మరో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: తుఫాన్ నేపథ్యంలో అధికారులు మరో రెండు జిల్లాలకు సెలవు ఇచ్చారు. ఇప్పటికే తూ.గో, అన్నమయ్య, కృష్ణా జిల్లాల్లోని విద్యాసంస్థలకు <<18103274>>హాలిడేస్<<>> ప్రకటించగా తాజాగా బాపట్ల, కడప జిల్లాల్లోనూ సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలో ఈనెల 27,28,29న, కడపలో 27,28న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.


