News November 28, 2024
విమానాలకు వెయ్యికిపైగా బెదిరింపు కాల్స్

దేశీయ విమాన సంస్థలకు ఈ ఏడాదిలో నవంబర్ 13 వరకు 994 నకిలీ బాంబు బెదిరింపులు వచ్చినట్టు కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి పటిష్ఠమైన ప్రోటోకాల్ అమలు చేస్తామని తెలిపింది. అదే 2022 ఆగస్టు-2024 నవంబర్ 13 వరకు మొత్తం 1,143 బెదిరింపు కాల్స్ వచ్చాయంది. వీటి విషయంలో కఠిన చర్యల కోసం Civil Aviation Act 1982, Aircraft (Security) రూల్స్ను సవరించనున్నట్టు తెలిపింది.
Similar News
News November 19, 2025
TMC విశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

టాటా మెమోరియల్ సెంటర్(TMC) హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ (విశాఖ)లో 15 కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎండీ, డీఎన్బీ, డీఎంతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ , స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://tmc.gov.in/
News November 19, 2025
ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్?

TG: BCలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించడంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. 50%లోపు రిజర్వేషన్లతో డెడికేటెడ్ కమిషన్ 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత రిజర్వేషన్లను ఫైనల్ చేసి గెజిట్ జాబితాను ECకి అందిస్తారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. DEC 25లోగా 3 విడతల్లో ఎలక్షన్స్ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 19, 2025
బంధంలో సైలెంట్ కిల్లర్

కొంతమంది మాట్లాడకుండా కూడా వేధిస్తుంటారు. దీనినే స్టోన్ వాలింగ్ అంటారు. వీరు ఇతరులతో పెద్దగా మాట్లాడరు. సీరియస్గా మాట్లాడుతున్నా కూడా సమాధానం చెప్పకుండా ముభావంగా ఉండడమో, మధ్యలోనే వెళ్లిపోవడమో చేస్తుంటారు. కొందరు అక్కర్లేని విషయాల గురించి ప్రస్తావిస్తుంటారు. కొన్నిసార్లు అసలు విషయం చెప్పకుండా ఆరోపణలు చేస్తుంటారు. ఇలాంటివారు తమ చేష్టలతో జీవిత భాగస్వామికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తారు.


