News November 28, 2024
విమానాలకు వెయ్యికిపైగా బెదిరింపు కాల్స్

దేశీయ విమాన సంస్థలకు ఈ ఏడాదిలో నవంబర్ 13 వరకు 994 నకిలీ బాంబు బెదిరింపులు వచ్చినట్టు కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి పటిష్ఠమైన ప్రోటోకాల్ అమలు చేస్తామని తెలిపింది. అదే 2022 ఆగస్టు-2024 నవంబర్ 13 వరకు మొత్తం 1,143 బెదిరింపు కాల్స్ వచ్చాయంది. వీటి విషయంలో కఠిన చర్యల కోసం Civil Aviation Act 1982, Aircraft (Security) రూల్స్‌ను సవరించనున్నట్టు తెలిపింది.
Similar News
News November 13, 2025
12 నెలల వేతనాల చెల్లింపునకు నిధులు విడుదల

AP: రాష్ట్రంలోని ఇమామ్‌లు, మౌజన్ల వేతనాల చెల్లింపునకు ప్రభుత్వం రూ.90 కోట్లు విడుదల చేసింది. ఇమామ్‌లకు నెలకు రూ.10,000, మౌజన్‌కు నెలకు రూ.5వేల చొప్పున 2024 ఏప్రిల్-జూన్, 2025 జనవరి-సెప్టెంబర్ నెలలకు గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీల సంక్షేమం, సాధికారతకు కట్టుబడి ఉందని తెలిపారు.
News November 13, 2025
‘ఓం’ అని పలికితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఓంకార నాదంతో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఈ పవిత్ర శబ్దం, విశ్వ నాదం(432 Hz)తో ఏకమై కొత్త శక్తిని సృష్టిస్తుంది. దీనివల్ల మన శరీరంలోని చక్రాలు ఉత్తేజితమై, అంతరంగాన్ని శుద్ధి చేస్తాయి. ఫలితంగా మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు దూరమవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. అందుకే నిత్యం ఓంకార పఠనం చేయాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు.
☛ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News November 13, 2025
124 పోస్టులకు SAIL నోటిఫికేషన్

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<


