News March 19, 2024
2025 చివరి నాటికి 20కిపైగా మోడళ్లు రిలీజ్ చేస్తాం: ఆడీ

2025 చివరిలోగా 20కిపైగా మోడళ్లను రిలీజ్ చేస్తామని ఆడీ సంస్థ వెల్లడించింది. 2027కు అన్ని మోడల్స్‌లోనూ EV వెర్షన్లను తెస్తామని తెలిపింది. 2024-2028 మధ్య తయారీకి ఏకంగా 41 బిలియన్ యూరోల (రూ.3.6లక్షల కోట్ల)ను ఖర్చు చేయనుంది. వీటిలో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికిల్స్ (PHEV) కోసం 11.5 బిలియన్ యూరోలు వెచ్చించనుంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం 29.5 బిలియన్ యూరోలు ఖర్చు చేయనుంది.
Similar News
News July 8, 2025
DEECET అభ్యర్థులకు అలర్ట్

AP: డైట్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన DEECETకు సంబంధించి అభ్యర్థులు ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ తెలిపింది. ఈనెల 13 నుంచి 16 వరకు సీట్ అలాట్మెంట్స్, 17 నుంచి 22 వరకు DIET కాలేజీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటాయని పేర్కొంది. 25న తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించింది.
News July 8, 2025
టెస్టుల్లో కొనసాగుతున్న సౌతాఫ్రికా జోరు

ఈ ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(WTC) గెలిచిన సౌతాఫ్రికా టెస్టుల్లో తన జోరు కొనసాగిస్తోంది. తాజాగా జింబాబ్వేను రెండో టెస్టులో చిత్తు చేసి వరుసగా 10వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ముల్డర్(367*) విజృంభణతో 626-5 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 170 రన్స్‌కి ఆలౌటైన జింబాబ్వే ఫాలోఆన్‌లో 220కే పరిమితమైంది. దీంతో ఇన్నింగ్స్ 236 రన్స్ తేడాతో SA భారీ విక్టరీ నమోదు చేసింది.
News July 8, 2025
రేపు హాల్‌టికెట్లు విడుదల

AP: రాష్ట్రంలోని ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల హాల్‌టికెట్లు రేపు విడుదల కానున్నాయి. అభ్యర్థులు ఇక్కడ <