News November 23, 2024
11 నెలల్లో 53వేలకు పైగా ఉద్యోగాలు: ప్రభుత్వం
TG: 11 నెలల్లో 53వేలకు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో విద్యాశాఖకు చెందినవే అత్యధికమని తెలిపింది. గురుకులాలు, స్కూళ్లలో 18,310 టీచింగ్ పోస్టులు, పోలీస్ శాఖలో 16,067 ఉద్యోగాలు, 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేశామని పేర్కొంది. ఇటీవల పలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చామని, ప్రస్తుతం వివిధ విభాగాల్లో 5,378 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది.
Similar News
News December 7, 2024
బీజేపీ ఆరోపణలను ఖండించిన అమెరికా
భారత ప్రధాని మోదీ, అదానీపై ఆరోపణల విషయంలో తమ ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థల హస్తం ఉందన్న BJP వ్యాఖ్యలను అమెరికా ఖండించింది. ఈ రకమైన ఆరోపణలు నిరుత్సాహకరమైనవని పేర్కొంది. కాగా మీడియా సంస్థ OCCRP, రాహుల్ గాంధీతో అమెరికా జట్టుకట్టిందని BJP ఇటీవల ఆరోపించింది. అందువల్లే OCCRP నివేదికలను చూపుతూ అదానీ, మోదీపై రాహుల్ విమర్శలు చేస్తున్నారని కమలం పార్టీ మండిపడింది.
News December 7, 2024
ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి.. 29 మంది మృతి
లెబనాన్‌పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తున్న ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ ఆస్పత్రిపై జరిపిన వైమానిక దాడిలో 29 మంది మృతి చెందారు. వరుస దాడులతో ఆస్పత్రి పరిసరాలు రక్తపుమడుగులతో నిండినట్టు అల్-జజీరా తెలిపింది. 2023 Oct నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటిదాకా 44,612 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా, లక్షకు పైగా గాయపడ్డారు.
News December 7, 2024
చంద్రబాబుపై VSR ఆరోపణలు.. టీడీపీ నేత ఫైర్
AP: పవన్ కళ్యాణ్‌పై చంద్రబాబు కుట్ర చేస్తున్నారని MP <<14817304>>విజయసాయిరెడ్డి<<>> చేసిన ఆరోపణలపై TDP నేత బుద్దా వెంకన్న స్పందించారు. ‘కూటమి ప్రకటన వచ్చినప్పటి నుంచి మీ ఏడుపులను ప్రజలు గమనిస్తున్నారు. ఎలాగైనా కూటమి మధ్య చిచ్చు పెట్టాలనే మీ తెలివి తక్కువ చేష్టలను ప్రజలు నమ్మరు. ఇకనైనా ఇలాంటి ఫిట్టింగ్ మాస్టర్ పనులు ఆపి మీ పార్టీపై దృష్టి పెట్టండి. లేదంటే ఈసారి ఉన్న 11 సీట్లు కూడా ఊడతాయి’ అని ట్వీట్ చేశారు.