News March 8, 2025
అడ్డంకులను అధిగమించి అంతర్జాతీయ స్థాయికి..!

ఝార్ఖండ్‌లోని దాహు అనే గ్రామంలో ఆడపిల్లలు ఇళ్లకే పరిమితం. కానీ, సీమా కుమారి ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. ఫుట్‌బాల్ ప్రోగ్రామ్‌లో చేరడంతో ఆమె గ్రామాన్ని వదిలి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఇలా జాతీయ , అంతర్జాతీయ టోర్నమెంట్స్‌కు ఆడుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. దీంతో సీమా జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం స్కాలర్‌షిప్‌తో హార్వర్డ్‌లో విద్యను అభ్యసిస్తున్నారు.
Similar News
News March 26, 2025
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్: సీఎం రేవంత్

TG: బెట్టింగ్ యాప్స్ వివాదంపై సీఎం రేవంత్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. పలువురిని విచారణకు కూడా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
News March 26, 2025
‘అంతరిక్ష వ్యవసాయం’

స్పేస్‌లో జరుగుతున్న పరిశోధనల్లో ఇదీ ఒకటి. ISSకు వెళ్లే వ్యోమగాములకు సరిపడా ఆహారాన్ని ప్రాసెస్డ్ చేసి పంపిస్తుంటారు. అక్కడే వ్యవసాయం చేసుకోగలిగితే వారు స్వయంగా తమ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోగలుగుతారని ఈ పరిశోధన ఉద్దేశం. అలాగే ఆ మొక్కల నుంచి స్పేస్‌లో ఆక్సిజన్ వెలువడుతుంది. అయితే, స్పేస్‌లో సూర్యరశ్మి, నీరు, ఆక్సిజన్, భూమి లేనప్పటికీ అక్కడ మొక్కలు వేగంగా పెరుగుతున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు.
News March 26, 2025
365 రోజుల్లో ‘ది ప్యారడైజ్’

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ‘ది ప్యారడైజ్’ సినిమా వచ్చే ఏడాది ఇదే రోజున విడుదల కానుంది. ఇంకా 365రోజులు అంటూ నాని ఓ పోస్టర్‌ను Xలో షేర్ చేశారు. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా నాని- శ్రీకాంత్ కాంబోలో వచ్చిన ‘దసరా’ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.