News August 6, 2024
HYDలో భూముల్ని ఆక్రమించిన ఒవైసీ బ్రదర్స్: అతీఫ్ రషీద్

MIM పార్టీ, ఒవైసీ బ్రదర్స్ హైదరాబాద్‌లో రూ.కోట్ల విలువైన భూములను ఆక్రమించారని జాతీయ మైనారిటీ కమిషన్ మాజీ వైస్ ఛైర్మన్ అతీఫ్ రషీద్ ఆరోపించారు. వక్ఫ్ చట్టంలో సవరణలను సమర్థిస్తూ ఆయన వారిని విమర్శించారు. ‘పౌరసత్వం పోతుందని CAAపై వారు ఇలాగే భయపెట్టారు. కాంగ్రెస్, SP సహా ఏ పార్టీ ముస్లిముల సమస్యలు పట్టించుకోవడం లేదు. వక్ఫ్ బోర్డులో అవినీతి జరుగుతుందని తెలిసీ వారెందుకు ప్రశ్నించడం లేదు’ అని అన్నారు.
Similar News
News April 15, 2026
హార్దిక్ నిర్ణయాలపై రోహిత్ సంతృప్తిగా లేరు: మాజీ క్రికెటర్

హార్దిక్ చెత్త నిర్ణయాల వల్లే RCB చేతిలో ముంబై ఓడిపోయిందని మాజీ క్రికెటర్ సడగొప్పన్ రమేశ్ అభిప్రాయపడ్డారు. ‘MIకి హార్దిక్ కెప్టెన్సీనే పెద్ద సమస్య. 7, 8వ ఓవర్లు వరుసగా స్పిన్నర్లకు ఇచ్చాడు. పాటీదార్ ఉన్నప్పుడు ఇలా చేయడం పెద్ద తప్పు. డేవిడ్‌కు హై ఫుల్ టాస్ వేసి DRSకు వెళ్లడంతో సూర్య షాకయ్యాడు. అటు రోహిత్ కూడా హార్దిక్ నిర్ణయాలపై సంతృప్తిగా లేనట్లు క్లియర్‌గా కనిపించింది’ అని తెలిపారు.
News April 15, 2026
విమానంలో మహిళపై రేప్.. భారతీయ ప్రయాణికుడిపై ఆరోపణలు

సింగపూర్ నుంచి ఆస్ట్రేలియాకు ప్రయాణిస్తున్న విమానంలో పక్కనే కూర్చున్న మహిళపై సుధీర్ కుమార్ (52) అనే భారతీయుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన స్కూట్ ఎయిర్ లైన్స్ సిబ్బంది బాధితురాలిని మరో సీటుకు మార్చినట్లు పేర్కొన్నారు. ఫ్లైట్ ల్యాండ్ అవగానే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా అక్కడి చట్టాల ప్రకారం గరిష్ఠంగా 12ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
News April 14, 2026
ఆస్ట్రేలియాలో ఐపీఎల్.. ఇండియాలో BBL?

IPL-2027లో ఒక మ్యాచును AUSలోని అడిలైడ్ ఓవల్ స్టేడియం హోస్ట్ చేసే అవకాశముంది. అక్కడ భారతీయులు ఎక్కువగా ఉండటంతో మ్యాచుకు క్రేజ్ ఎక్కువగా ఉంటుందని స్టేడియం మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే AUSలో జరిగే ‘బిగ్‌బాష్ లీగ్’ మ్యాచునూ INDలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికోసం చెన్నై స్టేడియాన్ని పరిశీలిస్తున్నట్లు టాక్. త్వరలోనే BCCIతో దీనిపై చర్చలు జరిగే ఛాన్సుంది.


