News April 4, 2025
‘వక్ఫ్ సవరణ’పై సుప్రీం కోర్టులో ఒవైసీ పిటిషన్

వక్ఫ్ సవరణ బిల్లుపై ఎంఐఎం అధినేత ఒవైసీ, కాంగ్రెస్ MP మహమ్మద్ జావేద్ విడివిడిగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ బిల్లు ముస్లిం వర్గాలపై వివక్ష చూపించేలా ఉందని, వారి ఆస్తుల్ని లాక్కునేలా ఉందని ఓవైసీ ఆరోపించారు. ‘ఆ బిల్లు ముస్లింల మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోంది’ అని జావేద్ పేర్కొన్నారు. ఉభయ సభలూ పాస్ చేసిన వక్ఫ్ సవరణ బిల్లుపై ఇవి తొలి రెండు పిటిషన్లు కావడం గమనార్హం.
Similar News
News December 9, 2025
సపోటాలో చెక్క తెగులు – నివారణకు సూచనలు

చెక్క తెగులు ఆశించిన సపోటా చెట్ల కొమ్మలు వంకరులు తిరిగిపోతాయి. ఆకులు రాలిపోయి.. కొమ్మలు ఎండిపోయిన చెక్కలుగా మారతాయి. ఈ తెగులును గుర్తించిన వెంటనే కొమ్మలను కత్తిరించి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్‌ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కల్లో ఇనుప ధాతు లోపం లేకుండా ఉండేందుకు 2గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1గ్రాము నిమ్మ ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
News December 9, 2025
గ్లోబల్ సమ్మిట్లో ₹5,39,495 కోట్ల పెట్టుబడులు

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2 రోజుల సదస్సులో ఇప్పటివరకు రూ.5,39,495 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. మొదటి రోజు రూ.2,43,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేలా వివిధ కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇక రెండో రోజైన మంగళవారం సాయంత్రం వరకు మరో రూ.2,96,495 కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. IT, POWER, TOURISM, FOREST తదితర విభాగాల్లో ఇవి వచ్చాయి.
News December 9, 2025
లారీల ‘బంద్’ తాత్కాలిక వాయిదా

AP: ఇవాళ అర్ధరాత్రి నుంచి <<18509425>>బంద్<<>> చేపట్టాలన్న నిర్ణయంపై లారీ ఓనర్స్ అసోసియేషన్ వెనక్కి తగ్గింది. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరడంతో సమ్మె వాయిదా పడింది. 4 రోజుల్లో ఫిట్‌నెస్ ఛార్జీలు రివైజ్ చేస్తామని రవాణాశాఖ కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 13-20 ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్‌నెస్ ఛార్జీలు పెంచడాన్ని లారీ యజమానులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.


