News April 4, 2025
‘వక్ఫ్ సవరణ’పై సుప్రీం కోర్టులో ఒవైసీ పిటిషన్

వక్ఫ్ సవరణ బిల్లుపై ఎంఐఎం అధినేత ఒవైసీ, కాంగ్రెస్ MP మహమ్మద్ జావేద్ విడివిడిగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ బిల్లు ముస్లిం వర్గాలపై వివక్ష చూపించేలా ఉందని, వారి ఆస్తుల్ని లాక్కునేలా ఉందని ఓవైసీ ఆరోపించారు. ‘ఆ బిల్లు ముస్లింల మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోంది’ అని జావేద్ పేర్కొన్నారు. ఉభయ సభలూ పాస్ చేసిన వక్ఫ్ సవరణ బిల్లుపై ఇవి తొలి రెండు పిటిషన్లు కావడం గమనార్హం.
Similar News
News April 20, 2025
ICICIకి రూ.13,502 కోట్ల నికర లాభం

జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.13,502 కోట్ల నికర లాభం వచ్చినట్లు ICICI ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 15.7 శాతం మేర నికర లాభం పెరిగినట్లు తెలిపింది. ఈ 3 నెలల్లో నికర వడ్డీ ఆదాయం 11 శాతం పెరిగి రూ.21,193 కోట్లు, వడ్డీయేతర ఆదాయం 18.4 శాతం వృద్ధితో రూ.7,021 కోట్లు నమోదైనట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.11 చొప్పున డివిడెండ్ చెల్లించాలని బ్యాంక్ నిర్ణయించింది.
News April 20, 2025
ఏప్రిల్ 20: చరిత్రలో ఈరోజు

✒ 1889: జర్మనీ నియంత హిట్లర్ జననం
✒ 1950: ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు జననం
✒ 1930: సినీ రచయిత త్రిపురనేని మహారథి జననం
✒ 1972: సినీ నటి మమతా కులకర్ణి జననం
✒ 1972: సినీ నటి అంజలా జవేరీ జననం
✒ 1992: టాలీవుడ్ తొలి నేపథ్య గాయకుడు ఎమ్ఎస్ రామారావు మరణం
News April 20, 2025
ఏం తప్పు చేశామో తెలియట్లేదు: పరాగ్

గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడం బాధ కలిగించిందని RR కెప్టెన్ రియాన్ పరాగ్ చెప్పారు. ‘మేం ఏం తప్పు చేశామో తెలియట్లేదు. 18-19 ఓవర్ వరకు మాదే గెలుపు అనుకున్నాం. 19 ఓవర్లోనే మ్యాచ్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఓటమికి నాదే బాధ్యత. అలాగే మా బౌలింగ్‌లో చివరి ఓవర్ సందీప్ శర్మ ఎక్కువ రన్స్ ఇచ్చారు. అతను మంచి బౌలరే కానీ అతని బ్యాడ్ లక్. సమద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు’ అని పేర్కొన్నారు.