News April 27, 2024

ఒవైసీ మతం, గోమాంసం గురించే మాట్లాడతారు: మాధవీలత

image

TG: మజ్లిస్ MP అసదుద్దీన్ ఒవైసీపై హైదరాబాద్ MP అభ్యర్థి మాధవీలత విమర్శలు గుప్పించారు. ‘ఒవైసీ మతం, గోమాంసం ఈ రెండు విషయాల గురించే మాట్లాడుతారు. ఎన్నికల ముంగిట పబ్లిక్‌లో గోవధ చేసి, గొడ్డు మాంసం తినాలని జనాలకు పిలుపునిస్తున్న వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ఆయన మేనిఫెస్టో గురించి అసలే మాట్లాడరు. న్యాయవాది అయిన ఒవైసీ ఇలా మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది’ అని అన్నారు.

Similar News

News April 14, 2026

అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

image

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్‌కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.

News April 14, 2026

3,058 ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు వచ్చేశాయ్

image

రైల్వేలో 3,058 NTPC(UG) ఉద్యోగాలకు పరీక్షల తేదీలను RRB విడుదల చేసింది. మే 7, 8, 9, జూన్ 13, 14, 16-21 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షలకు 10 రోజుల ముందు అభ్యర్థులకు కేటాయించిన సిటీ పేరు, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను రిలీజ్ చేస్తామని వెల్లడించింది. రోజూ 3 షిఫ్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు ఉంటుంది.

News April 14, 2026

గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్.. లక్షణాలు ఇవే

image

కొందరు మహిళల గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు అనే గడ్డలు తయారవుతుంటాయి. దీని వల్ల నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్స్‌ పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడిపడి తరచూ మూత్రవిసర్జన, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరగడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.