News October 20, 2024

సొంత నియోజకవర్గం.. చంద్రబాబుకు దక్కని చోటు

image

AP: కుప్పం ద్రవిడ యూనివర్సిటీ 27వ వ్యవస్థాపక దినోత్సవ ఆహ్వాన పత్రికపై వివాదం నెలకొంది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న వేడుకలో ఆయన పేరు లేకపోవడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కుప్పం MLAగా, సీఎం హోదాలో ఉన్న ఆయన పేరును అధికారులు ప్రొటోకాల్‌లో పట్టించుకోలేదంటున్నారు. చిత్తూరు ఎంపీ, MLC, RTC వైస్ ఛైర్మన్, కలెక్టర్ సహా పలువురి పేర్లతో ఆహ్వానపత్రికను ముద్రించారు.

Similar News

News October 17, 2025

నేటి నుంచి ఉచితంగా చేప పిల్లల పంపిణీ

image

TG: రాష్ట్రవ్యాప్తంగా మత్య్సకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ నేడు ప్రారంభం కానుంది. 88 కోట్ల చేప, 10 కోట్ల రొయ్య పిల్లలను ప్రభుత్వం అందించనుంది. 32 జిల్లాల్లోని 46వేల చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో పెంచేందుకు వీలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందుకు రూ.123 కోట్లు ఖర్చు చేస్తోంది. మక్తల్‌లో మంత్రులు వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహ, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.

News October 17, 2025

భారీగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు!

image

ధన త్రయోదశికి ముందు బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇవాళ HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,330 పెరిగి ₹1,32,770కు చేరింది. ఏడు రోజుల్లో రూ.9,060 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 3,050 ఎగబాకి ₹1,21,700గా ఉంది. అటు వెండి ధర మాత్రం రూ.3,000 తగ్గింది. కేజీ సిల్వర్ రేటు రూ.2,03,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 17, 2025

భారత్‌తో సిరీస్.. ఆసీస్ కీలక ప్లేయర్ ఔట్

image

భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కండరాల నొప్పితో సిరీస్‌కు దూరమయ్యారు. అతని స్థానంలో మార్నస్ లబుషేన్‌‌ను ఎంపిక చేశారు. ఈ నెల 19న తొలి వన్డే పెర్త్‌లో, 23న రెండోది అడిలైడ్, మూడో వన్డే 25న సిడ్నీలో జరగనుంది. మొదటి మ్యాచ్ పెర్త్‌‌లో జరగనుండగా, అక్కడి బౌన్సీ పిచ్ మన బ్యాటర్లకు సవాలు విసరనుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.