News October 20, 2024
సొంత నియోజకవర్గం.. చంద్రబాబుకు దక్కని చోటు
AP: కుప్పం ద్రవిడ యూనివర్సిటీ 27వ వ్యవస్థాపక దినోత్సవ ఆహ్వాన పత్రికపై వివాదం నెలకొంది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న వేడుకలో ఆయన పేరు లేకపోవడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కుప్పం MLAగా, సీఎం హోదాలో ఉన్న ఆయన పేరును అధికారులు ప్రొటోకాల్‌లో పట్టించుకోలేదంటున్నారు. చిత్తూరు ఎంపీ, MLC, RTC వైస్ ఛైర్మన్, కలెక్టర్ సహా పలువురి పేర్లతో ఆహ్వానపత్రికను ముద్రించారు.
Similar News
News November 3, 2024
తీవ్ర వివాదంలో ఇషాన్ కిషన్!
ఆస్ట్రేలియా-A, ఇండియా-A మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బంతి మార్పుపై అంపైర్‌తో వాగ్వాదానికి దిగారు. మార్చిన బంతితోనే ఆడాలని అంపైర్ చెప్పగా కిషన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘తెలివితక్కువ నిర్ణయం’ అని కామెంట్స్ చేశారు. ‘మీ వల్లే బంతి దెబ్బతింది. మీ ప్రవర్తన అనుచితం’ అని ఇషాన్‌కు అంపైర్ వార్నింగ్ ఇచ్చారు. అంపైర్ బాల్ టాంపరింగ్ ఆరోపణలు నిజమని తేలితే ఇషాన్, పలువురు ఆటగాళ్లపై వేటు పడే ప్రమాదం ఉంది.
News November 3, 2024
అమెరికాలో భారత ఓటర్లు ఎంత మందో తెలుసా?
అమెరికాలో మెక్సికన్ల తర్వాత ఎక్కువ మంది వలసదారులు ఇండియాకు చెందినవారే ఉన్నారు. అగ్రరాజ్యంలో ప్రస్తుతం 52 లక్షల మంది ఇండో-అమెరికన్స్ ఉండగా, ఇందులో 26 లక్షల మందికి ఓటు హక్కు ఉంది. చాలా ఏళ్లుగా వీరు డెమొక్రటిక్ పార్టీకి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. ఈసారి మాత్రం ఓట్లు గంపగుత్తగా డెమొక్రటిక్ పార్టీకి పడే అవకాశం లేదని, యువతలో చాలా మంది ట్రంప్ వైపు చూస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
News November 3, 2024
ఢిల్లీలో మరింత పడిపోయిన వాయు నాణ్యత
దేశరాజధాని ఢిల్లీని కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీపావళి పండుగ ముగిసిన రెండు రోజులకు అక్కడ వాయు నాణ్యత మరింత క్షీణించింది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ WHO సూచించిన పరిమితి కంటే 65 రెట్లు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఉ.5గంటలకు AQI 507 పాయింట్లతో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.