News March 17, 2024

ప.గో. జిల్లాలో YCP నుంచి ఐదుగురు కొత్తగా

image

ఉమ్మడి జిల్లాలో ఈసారి ఐదుగురు కొత్తవారికి వైసీపీ అవకాశం కల్పించింది. ఏలూరు ఎంపీ అభ్యర్థి సునీల్‌కుమార్‌ యాదవ్‌, నరసాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి విజయరాజు (రిటైర్డ్‌ రవాణా శాఖ అధికారి), పోలవరం అసెంబ్లీ అభ్యర్థి రాజ్యలక్ష్మి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ), పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థి గుడాల గోపికి పార్టీ అవకాశం ఇచ్చింది.

Similar News

News December 21, 2025

కాళ్ల: చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్

image

ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్‌ సి.నాగరాణి తల్లిదండ్రులకు సూచించారు. ఆదివారం పెదఅమీరంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించి, చిన్నారులకు చుక్కల మందు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ గీతాబాయ్, సర్పంచి డొక్కు సోమేశ్వరరావు పాల్గొన్నారు.

News December 21, 2025

ఈనెల 22న వీరవాసరంలో జిల్లాస్థాయి సైన్ ఫెయిర్

image

ఈ నెల 22న వీరవాసరం ఎంఆర్‌కె జడ్పీ హైస్కూల్‌లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు డీఈవో నారాయణ తెలిపారు. ఈ సైన్స్ ఫెయిర్లో పాఠశాలల నుంచి మండల స్థాయికి ఎంపికైన, మండల స్థాయిలో ఉత్తమంగా ఎంపికైన సైన్స్ ప్రదర్శనలు ప్రదర్శిస్తారన్నారు. జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌కి ఎంపికైన ఎగ్జిబిట్స్ ముందు రోజే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.

News December 21, 2025

తాడేపల్లిగూడెం: మోపెడ్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

image

పెదతాడేపల్లి సమీపంలోని వెల్లమిల్లి స్టేజ్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిపూడి పెద్దిరాజు మృతి చెందారు. వెల్లమిల్లిలో పని ముగించుకుని కొమ్ముగూడెం వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన లారీ వీరి మోపెడ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పెద్దిరాజు గాయాలతో చికిత్స పొందుతూ కన్నుమూయగా, మోపెడ్ నడుపుతున్న చెల్లయ్య తలకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.