News March 17, 2024
ప.గో.: నేతలకు పరీక్ష.. పాస్ అయ్యేదెవరు..?

ఎన్నికల్లో బరిలో నిలిచే నాయకుల జీవితాన్ని జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థితో పోలిస్తే..ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు (జాబ్ నోటిఫికేషన్). నిన్నటి నుంచి 57రోజుల పాటు ప్రిపరేషన్ (ప్రచారానికి) సమయం. మే 13న పరీక్ష(ఓటింగ్). ఆ తర్వాత 22 రోజులకు జూన్ 4న ఫలితాలు. ఉమ్మడి ప.గో. జిల్లాలో 15 స్థానాలకు(పోస్టులకు) ఎంతమంది పరీక్ష రాస్తారన్నది తేలాలి. ఏప్రిల్ 25 వరకు పరీక్షకు అప్లై (నామినేషన్) చేసుకోనున్నారు.
Similar News
News February 3, 2026
ఈనెల 5న ఉద్యోగ దిక్చూచి జాబ్ మేళా: కలెక్టర్

వాసవి పెనుగొండ లో ఈనెల 5 నిర్వహించే ఉద్యోగ దిక్చూచి జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఉద్యోగ దిక్సూచి జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 15 కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. యువ అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులన్నారు. https://naipunyam.ap.gov.in రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
News February 2, 2026
పోలీస్ శాఖ పీజీఆర్‌ఎస్‌కు 23 అర్జీలు: ఎస్పీ

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. సోమవారం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఆయన పాల్గొని ప్రజల నుంచి 23 అర్జీలను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలతో పాటు సైబర్ మోసాలు, అధిక వడ్డీ వేధింపులపై ఫిర్యాదులు అందాయని తెలిపారు.
News February 2, 2026
భీమవరం: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి

భీమవరం రూరల్ మండలం రాయలం గ్రామ శివారులో ఆదివారం ఓ కారు రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఓ గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.


