News March 21, 2024

సికింద్రాబాద్ BRS MP అభ్యర్థిగా పద్మారావు?

image

TG: సికింద్రాబాద్ BRS MP అభ్యర్థిగా మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరు ఖరారైనట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీసీ అభ్యర్థిని బరిలోకి దించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా బీసీకే ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తొలుత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడిని పోటీ చేయించాలని ప్రయత్నించగా ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో పద్మారావును అభ్యర్థిగా నిర్ణయించినట్లు టాక్.

Similar News

News November 27, 2025

సిద్దిపేట: యువకుడి సూసైడ్.. ముగ్గురిపై కేసు

image

ప్రేమించిన యువతి దక్కడం లేదని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. వర్గల్ మం. అంబర్‌పేట వాసి పవన్ కళ్యాణ్(21), ఓ యువతి ప్రేమించుకున్నారు. వాళ్ల పెళ్లికి పెద్దలు నిరాకరించారు. ఇంటికి వెళ్లిన పవన్‌పై యువతి తండ్రి శ్రీనివాస్, మహేష్, తిరుపతి కలిసి దాడి చేశారు. దీంతో గడ్డి మందు తాగిన పవన్ చికిత్స పొందుతూ ఈనెల 25 మృతి చెందాడు. ఈ ఘటనలో ముగ్గురిని రిమాండ్ చేశారు.

News November 27, 2025

రాజ్యాంగంలోని ప్రాథమిక విధులివే..

image

ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్న పౌరులు విధులనూ నిర్వర్తించాలని రాజ్యాంగదినోత్సవంలో నాయకులంతా పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-Aలో ఉన్న 11 ప్రాథమిక విధులు క్లుప్తంగా.. రాజ్యాంగ సంస్థలు, పతాకం, గీతం, సమరయోధులు, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలకు అతీతంగా ఉండాలి. పర్యావరణం, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. పిల్లలకు విద్యను అందించాలి.

News November 27, 2025

రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

image

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్‌పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.