News March 21, 2024

సికింద్రాబాద్ BRS MP అభ్యర్థిగా పద్మారావు?

image

TG: సికింద్రాబాద్ BRS MP అభ్యర్థిగా మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరు ఖరారైనట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీసీ అభ్యర్థిని బరిలోకి దించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా బీసీకే ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తొలుత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడిని పోటీ చేయించాలని ప్రయత్నించగా ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో పద్మారావును అభ్యర్థిగా నిర్ణయించినట్లు టాక్.

Similar News

News April 12, 2026

2 ఏళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు బ్యాన్!

image

2 ఏళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్‌లను ప్రిస్క్రిప్షన్‌లో రాయకుండా నిషేధించాలని కేంద్రం భావిస్తోంది. ఐదేళ్ల పిల్లలకూ వాటి వాడకాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ రిలీజ్ చేసిన నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా-2026 ముసాయిదాలో భాగంగా ఈ చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గతేడాది దగ్గు మందు వల్ల పిల్లలు <<17944156>>చనిపోవడం<<>>, సిరప్‌లో హానికర రసాయనాలు ఉన్నట్లు తేలడం తెలిసిందే.

News April 12, 2026

చైనాకు ట్రంప్ వార్నింగ్

image

ఇరాన్‌కు చైనా ఆయుధాలు పంపే అవకాశం ఉందన్న అమెరికా <<19628773>>నిఘా వర్గాల<<>> హెచ్చరికలపై ట్రంప్ స్పందించారు. చైనా అలా చేస్తే పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్‌తో చర్చల్లో విజయం తమదేనని అన్నారు. ‘చర్చల్లో ఒప్పందం కుదరొచ్చు, కుదరకపోవచ్చు. అదంతా పట్టించుకోను. గెలిచేది మనమే. నౌకలు మన దేశం వైపు బయల్దేరుతున్నాయి. భారీ ట్యాంకర్లలో చమురు, గ్యాస్ నింపుతున్నాం’ అని చెప్పారు.

News April 12, 2026

రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో 24 సార్లు డ్రగ్స్ పార్టీలు!

image

TG: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో 24 సార్లు డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. దుబాయ్‌లో డ్రగ్స్ పార్టీల్లో ఆయన పాల్గొన్నారని, పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపారని కనిపెట్టినట్లు సమాచారం. కస్టడీలో కీలక విషయాలను అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ఆయన అరెస్టు కావడం తెలిసిందే.