News January 26, 2025
పెద్ద కర్మ రోజే ‘పద్మశ్రీ’ ప్రకటన

AP: బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు కేంద్రం ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించింది. కొద్దిరోజులుగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఇటీవల మరణించారు. నిన్న ఆయన పెద్ద కర్మ జరుగుతుండగానే అవార్డు ప్రకటన వచ్చింది. కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన అప్పారావు చిన్నప్పటి నుంచే బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు. సింగపూర్, కువైట్లో కూడా ఆయన గాత్రం వినిపించారు. అప్పారావు దాదాపు 5వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు.
Similar News
News November 19, 2025
HYD: సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టు సీరియస్

సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై సంధ్య శ్రీధర్రావు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం హైడ్రా తీరుపై సీరియస్ అయింది. కూల్చివేతలకు అనుమతి ఎవరిచ్చారని కోర్టు ప్రశ్నించింది. ‘కోర్టు ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదు’ అని హైడ్రాను నిలదీసింది. ఈ కేసు తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.
News November 19, 2025
ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్?

TG: BCలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించడంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. 50%లోపు రిజర్వేషన్లతో డెడికేటెడ్ కమిషన్ 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత రిజర్వేషన్లను ఫైనల్ చేసి గెజిట్ జాబితాను ECకి అందిస్తారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. DEC 25లోగా 3 విడతల్లో ఎలక్షన్స్ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 19, 2025
బంధంలో సైలెంట్ కిల్లర్

కొంతమంది మాట్లాడకుండా కూడా వేధిస్తుంటారు. దీనినే స్టోన్ వాలింగ్ అంటారు. వీరు ఇతరులతో పెద్దగా మాట్లాడరు. సీరియస్గా మాట్లాడుతున్నా కూడా సమాధానం చెప్పకుండా ముభావంగా ఉండడమో, మధ్యలోనే వెళ్లిపోవడమో చేస్తుంటారు. కొందరు అక్కర్లేని విషయాల గురించి ప్రస్తావిస్తుంటారు. కొన్నిసార్లు అసలు విషయం చెప్పకుండా ఆరోపణలు చేస్తుంటారు. ఇలాంటివారు తమ చేష్టలతో జీవిత భాగస్వామికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తారు.


