News January 26, 2025
పెద్ద కర్మ రోజే ‘పద్మశ్రీ’ ప్రకటన

AP: బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు కేంద్రం ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించింది. కొద్దిరోజులుగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఇటీవల మరణించారు. నిన్న ఆయన పెద్ద కర్మ జరుగుతుండగానే అవార్డు ప్రకటన వచ్చింది. కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన అప్పారావు చిన్నప్పటి నుంచే బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు. సింగపూర్, కువైట్‌లో కూడా ఆయన గాత్రం వినిపించారు. అప్పారావు దాదాపు 5వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు.
Similar News
News February 16, 2025
IPL-2025: ఏ జట్టుకు ఏ రోజు మ్యాచ్(FULL LIST)

ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి మే 25 వరకు జరగనుంది. మొత్తం పది టీమ్(KKR, SRH, RCB, CSK, MI, DC, PBKS, GT, LSG, RR)లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఏ జట్టు ఏ రోజు ఎవరితో ఏ వేదికలో మ్యాచ్ ఆడనుంది? పూర్తి జాబితాను పై ఫొటోల్లో చూడవచ్చు.
News February 16, 2025
మిస్డ్ కాల్‌కు తిరిగి కాల్ చేస్తే అంతే సంగతులు

గుర్తుతెలియని నంబర్ల నుంచి మిస్డ్ కాల్ వస్తే ఎట్టిపరిస్థితుల్లో తిరిగి కాల్ చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరిస్తున్నారు. +371(5), +381 (2) నంబర్ల నుంచి కాల్ చేసి #90 లేదా #09 డయల్ చేయమని అడిగితే ఎట్టిపరిస్థితుల్లో చేయొద్దన్నారు. అలా చేస్తే నేరగాళ్లు మీ ఫోన్‌ను హ్యాక్ చేస్తారన్నారు. సైబర్ నేరాలకు గురైతే 1930ను సంప్రదించాలన్నారు.
News February 16, 2025
నీతా అంబానీకి అరుదైన గౌరవం

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. దార్శనికత, దాతృత్వం, సామాజిక సేవలతో గ్లోబల్ ఛేంజ్‌మేకర్‌గా నిలుస్తున్నారని USAలోని మసాచుసెట్స్ ప్రభుత్వం కొనియాడింది. విద్య, ఆరోగ్యం, స్పోర్ట్స్, తదితర రంగాల్లో ఆమె సేవలు గొప్పవని పేర్కొంది. ఈ మేరకు ప్రతిష్ఠాత్మక ‘గవర్నర్ ప్రశంసాపత్రం’ అందజేసింది. బోస్టన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ హీలీ అవార్డ్ అందజేసినట్లు నీతా అంబానీ ఆఫీస్ తెలిపింది.