News November 18, 2024
తిరుమలలో అన్యమత రీల్స్ కలకలం.. ఇద్దరు మహిళలపై కేసు

AP: తిరుమలలో <<14637965>>అన్యమతానికి <<>>సంబంధించి సోషల్ మీడియాలో రీల్స్ చేసిన ఇద్దరు మహిళలపై టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తిరుపతి ఓటేరుకు చెందిన శంకరమ్మ, మీనాక్షి పాపవినాశంలో ఇతర మతానికి చెందిన పాటలతో రీల్స్ చేస్తుండటంపై స్థానిక షాపుల ఓనర్లు విజిలెన్స్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో తిరుమల టూ టౌన్ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
Similar News
News March 9, 2026
BREAKING: శుభవార్త చెప్పిన ప్రభుత్వం

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను పెంచబోమని ప్రకటించింది. నష్టాలను ఆయిల్ కంపెనీలే భరించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే గ్యాస్ ధరల <<19316911>>పెరుగుదలతో<<>> ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు కేంద్ర నిర్ణయంతో కాస్త ఊరట లభించనుంది.
News March 9, 2026
కన్నీళ్లు ఆపుకొని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్

T20WC ఫైనల్‌లో ఆడటం క్రికెటర్ల కల. అలాంటిది ఒక్కరోజు ముందే కుటుంబ సభ్యులను కోల్పోతే వచ్చే దుఃఖం వర్ణనాతీతం. అలాంటి విషాద ఘటన కిషన్ ఇంట నెలకొంది. 7వ తేదీ కారు ప్రమాదంలో అతని కజిన్ సిస్టర్ వైష్ణవి, బావ చనిపోయారు. అయినా కన్నీళ్లు ఆపుకొని కిషన్ నిన్న 54 రన్స్ చేశారు. మ్యాచ్ ఆమె కోసమే ఆడానని, గెలుపు సోదరికి అంకితమన్నారు. బాధను హార్దిక్‌తో పంచుకోగా ఈ టైమ్‌లో దేశమే ముఖ్యమని స్ఫూర్తి నింపినట్లు చెప్పారు.
News March 9, 2026
నెతన్యాహుతో మాట్లాడే డిసైడ్ చేస్తా: ట్రంప్

ఇరాన్‌పై యుద్ధం ఎప్పుడు ఆపాలనేది ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అది సంయుక్తంగా తీసుకోవాల్సిన నిర్ణయమని, సరైన సమయంలో డెసిషన్ తీసుకుంటామన్నారు. తాము దాడి చేయకపోతే ఇజ్రాయెల్‌ను ఇరాన్ అంతం చేసి ఉండేదన్నారు. కాగా ఇరాన్‌పై US, ఇజ్రాయెల్ యుద్ధం పదో రోజుకి చేరింది. మరోవైపు సౌదీపై దాడిలో భారతీయులు ఎవరూ చనిపోలేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.


