News October 15, 2025

బిహార్ ఎన్నికలకు 12 మందితో BJP రెండో జాబితా

image

బిహార్ ఎన్నికలకు BJP 12 మంది అభ్యర్థులతో రెండో విడత జాబితాను విడుదల చేసింది. NDAలోని పార్టీలతో ఒప్పందంలో భాగంగా BJP 101 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటివరకు 83 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయగా ఇంకా 18 సీట్లకు ప్రకటించాల్సి ఉంది. కూటమిలోని జేడీయూ 48 మందితో జాబితాను ప్రకటించింది. మరోవైపు JSP 51 స్థానాలకు, ఆమ్ ఆద్మీ పార్టీ 59 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి.

News October 15, 2025

సాయంకాలం నిద్రపోతున్నారా?

image

పగలు ముగిసి, రాత్రి మొదలయ్యే సమయంలో దేవతలందరూ శివ తాండవ వీక్షణలో తన్మయత్వం పొందుతూ ఉంటారు. అందువల్ల దైవ రక్షణ ప్రభావం కొంత మేర తగ్గుతుంది. ఈ అవకాశాన్ని అసుర శక్తులు వాడుకుంటాయి. ప్రజలను బాధించడానికి నిద్ర రూపంలో మనలోకి ప్రవేశించాలని చూస్తాయి. ఈ బలహీనతలకు మనం లొంగితే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈ వేళలో నిద్ర పోవద్దని పెద్దలు అంటుంటారు. * మరిన్ని ధర్మ సందేహాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 15, 2025

రూ.1కే రీఛార్జ్.. 30 రోజుల పాటు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్

image

దీపావళి సందర్భంగా కొత్త యూజర్లకు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL బంపరాఫర్ ప్రకటించింది. రూ.1కే 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 2 జీబీ డేటా, 100 SMSలు అందించనున్నట్లు పేర్కొంది. సిమ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ‘BSNL దీపావళి బొనాంజా’ ఆఫర్ నేటి నుంచి నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుందని Xలో వెల్లడించింది.

News October 15, 2025

మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు సిద్ధం: ఉత్తమ్

image

TG: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు తలెత్తితే 1800-425-00333/1967 హెల్ప్ లైన్ నంబర్‌కి ఫోన్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రైతులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 నుంచి 72 గంటల్లో నగదు చెల్లింపు చేయాలని అధికారులతో సమీక్షలో ఆదేశించారు. ఈ సీజన్‌లో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

News October 15, 2025

సికింద్రాబాద్‌లో టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్

image

సికింద్రాబాద్‌లోని AOC సెంటర్‌లోని థాపర్ స్టేడియంలో NOV 15 నుంచి DEC 1వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. 110 ఇన్ఫాంట్రీ బెటాలియన్( టెరిటోరియల్ ఆర్మీ), 117 ఇన్ఫాంట్రీ బెటాలియన్ ది గార్డ్స్, 125 ఇన్ఫాంట్రీ బెటాలియన్ ది గార్డ్స్‌లో సైనికుల కోసం ఈ ర్యాలీ జరుగుతుంది. టెన్త్ పాసై శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు https://www.ncs.gov.in/ను సంప్రదించవచ్చు.

News October 15, 2025

అంతరపంటగా ‘అనప’.. ఎకరాకు రూ.10వేల ఆదాయం

image

రబీలో వేరు శనగ, జొన్న, ఆముదం, కంది పంటల్లో అంతరపంటగా సాగు చేయడానికి అనపకాయలు అనుకూలం. 60-70 రోజులకు పూతకు వచ్చి 130 రోజుల్లో పంట కాలం పూర్తవుతుంది. ఎకరాకు 1-2KGలను 90*20సె.మీ దూరం ఉండేలా గొర్రు లేదా నాగలితో విత్తుకోవాలి. ఎకరాకు 8KGల నత్రజని, 20KGల భాస్వరం, 10KGల పొటాష్‌నిచ్చే ఎరువులను వేసుకోవాలి. ఎకరాకు సాగు ఖర్చు రూ.1,500-2K, నికర ఆదాయం రూ.10K వరకు ఉంటుంది.

News October 15, 2025

ఆస్ట్రేలియా అంటే వీరికి పూనకాలే..

image

ఆస్ట్రేలియాపై వన్డేల్లో విరాట్, రోహిత్‌లకు మంచి రికార్డులు ఉన్నాయి. అత్యధిక రన్స్ చేసిన లిస్టులో సచిన్, కోహ్లీ, రోహిత్ టాప్-3లో ఉన్నారు. సచిన్ 71 ఇన్నింగ్సుల్లో 3,077 రన్స్, 9 సెంచరీలు చేశారు. కోహ్లీ 50 ఇన్నింగ్సుల్లో 2,451, రోహిత్ 46 ఇన్నింగ్సుల్లో 2,407 పరుగులు చేశారు. విరాట్, హిట్‌మ్యాన్ చెరో 8 సెంచరీలు బాదారు. OCT 19 నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌లోనూ RO-KO రాణించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

News October 15, 2025

జోగి రమేశ్ అరెస్టుకు రంగం సిద్ధం?

image

AP: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి <<17996336>>జోగి రమేశ్<<>> అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం తయారీకి ప్రోత్సహించింది రమేశే అని A-1 జనార్దన్ రావు చెప్పడంతో ఎక్సైజ్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. మద్యం పట్టుబడిన ANR గోడౌన్ పరిసరాల సీసీ ఫుటేజిని పరిశీలించారు. కాగా జనార్దన్ రావుతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని జోగి రమేశ్ స్పష్టం చేశారు.

News October 15, 2025

ఏపీ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

image

ఏపీ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఎన్టీఆర్ జిల్లా నుంచి 20 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 22 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ntr.ap.gov.in/

News October 15, 2025

తాజా రౌండప్

image

* TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు మూడో రోజు 11 నామినేషన్లు.. మొత్తంగా 32 నామినేషన్లు దాఖలు
* రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 సెంటర్లలో మొక్కజొన్న పంట కొనుగోళ్లు
* బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: రఘోపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
* వరుస నష్టాలకు బ్రేక్.. నిఫ్టీ 178 పాయింట్లు, సెన్సెక్స్ 575 పాయింట్లు అప్