News October 15, 2025

విప్లవం లేదు గిప్లవం లేదు: సీఎం మార్పుపై సిద్దరామయ్య

image

కర్ణాటక కాంగ్రెస్‌లో CM మార్పు అంశం నెలలో ఒక్కసారైనా తెరపైకి రావడం సర్వ సాధారణమైంది. ఇటీవల రాష్ట్రంలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నవంబర్‌లో విప్లవం (క్రాంతి) రాబోతోందని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై సీఎం సిద్దరామయ్యను ఓ విలేకరి ప్రశ్నించగా ‘క్రాంతి లేదు భ్రాంతి లేదు’ అని కొట్టిపారేశారు. తానే సీఎంగా కొనసాగుతానని పునరుద్ఘాటించారు. నాయకత్వ మార్పుపై వచ్చేవన్నీ అసత్యాలేనని స్పష్టం చేశారు.

News October 15, 2025

బిహార్‌‌లో పురుష ఓటర్లదే ఆధిక్యం.. కానీ!

image

బిహార్‌‌లో పురుష ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 3.92 కోట్ల పురుష ఓటర్లు ఉండగా స్త్రీ ఓటర్లు 3.5 కోట్లు ఉన్నారు. ప్రతి 1000 మంది పురుషులకు 892 మంది స్త్రీ ఓటర్ల నిష్పత్తి నమోదైంది. గత ఎన్నికల్లో (899) కన్నా ఇది తగ్గింది. స్త్రీలు తమ భర్తలు ఫారాలు తెచ్చినప్పుడే మాత్రమే ఓటర్లుగా నమోదవుతున్నారు. అయితే ఓటింగ్‌లో మాత్రం చురుగ్గా పాల్గొంటూ ఎన్నికల ఫలితాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని NDA పేర్కొంది.

News October 15, 2025

2030 కామన్‌వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం

image

కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ ఎంపికైంది. 2030లో జరిగే ఈ క్రీడలు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. 2010లో భారత్ తొలిసారి కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ల తర్వాత మరోసారి భారత్‌ ఈ క్రీడలకు వేదిక కానుంది. కాగా అహ్మదాబాద్‌ను కామన్‌వెల్త్ బోర్డు వేదికగా ప్రతిపాదించింది. దీనిపై వచ్చే నెల 26న తుది నిర్ణయం ప్రకటించనుంది.

News October 15, 2025

ట్యాబ్లెట్లతో మైగ్రేన్‌ను ఆపాలనుకుంటున్నారా?

image

మైగ్రేన్ సమస్య ఈ మధ్యకాలంలో చాలామందిని వేధిస్తోంది. ఈ తలనొప్పి జీవిత నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో నెలకు మూడు సార్లకంటే ఎక్కువ మైగ్రేన్ ట్యాబ్లెట్స్ వాడొద్దని ప్రముఖ న్యూరో డాక్టర్ సుధీర్ తెలిపారు. ‘తరచుగా వాడితే తలనొప్పి మరింత పెరిగే ప్రమాదం ఉంది. మైగ్రేన్‌ను అదుపులో ఉంచుకునేందుకు వైద్యుడిని సంప్రదించండి. తక్షణ మందులకు బదులు నివారణ చికిత్స గురించి సలహా తీసుకోండి’ అని తెలిపారు.

News October 15, 2025

పాక్-అఫ్గాన్ మధ్య సీజ్‌ఫైర్.. అడుక్కున్న పాకిస్థాన్!

image

పాకిస్థాన్-అఫ్గాన్ కాల్పుల విరమణ(సీజ్‌ఫైర్)కు అంగీకరించాయి. 48 గంటల పాటు ఇది అమల్లో ఉండనుంది. పాక్ ఆర్మీ సీజ్‌ఫైర్ కోసం అఫ్గానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వాన్ని అడుక్కున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య జరిగిన <<18012870>>ఘర్షణల్లో<<>> పాక్ సైనికులతో పాటు అఫ్గాన్ సోల్జర్స్, TTP ఫైటర్లు, అమాయక ప్రజలు మరణించారు. కాగా ఆపరేషన్ సిందూర్‌తో భారీగా నష్టపోయిన పాక్.. భారత్‌ను సీజ్‌ఫైర్ కోసం అభ్యర్థించిన సంగతి తెలిసిందే.

News October 15, 2025

అనంతపురంలో ఏరోస్పేస్&ఆటోమోటివ్: లోకేశ్

image

AP: అనంతపురంలో రేమండ్ కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఏరోస్పేస్, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల సబ్సిడీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

News October 15, 2025

పప్పులో కాలేసిన ఇన్వెస్టర్లు.. LG అనుకొని!

image

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ‘LG ఎలక్ట్రానిక్స్‌’ స్టాక్‌మార్కెట్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇన్వెస్టర్లు షేర్లు కొనేందుకు ఎగబడ్డారు. అయితే చాలామంది సరైన కంపెనీని సెర్చ్ చేయకుండా పప్పులో కాలేశారు. LG ఎలక్ట్రానిక్స్‌కి బదులు పొరపాటున LG బాలకృష్ణన్ & బ్రదర్స్ లిమిటెడ్ షేర్లు కొనేశారు. దీంతో ఈ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 20% పెరిగిపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

News October 15, 2025

రేపు ఏపీలో పర్యటిస్తున్నా: మోదీ

image

గురువారం ఏపీలో పర్యటించనున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ముందుగా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కర్నూలులో రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. అంతకుముందు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే.

News October 15, 2025

ఇతిహాసాలు క్విజ్ – 36 సమాధానాలు

image

1. దశరథుడి తల్లి ఇందుమతి.
2. పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉంటారు.
3. విష్ణువు ధనస్సు పేరు ‘సారంగం’.
4. తెలంగాణలోని భద్రాచలం ఆలయం గోదావరి నది ఒడ్డున ఉంది.
5. శుక అంటే చిలుక అని అర్థం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 15, 2025

బిహార్ ఎన్నికలకు 12 మందితో BJP రెండో జాబితా

image

బిహార్ ఎన్నికలకు BJP 12 మంది అభ్యర్థులతో రెండో విడత జాబితాను విడుదల చేసింది. NDAలోని పార్టీలతో ఒప్పందంలో భాగంగా BJP 101 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటివరకు 83 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయగా ఇంకా 18 సీట్లకు ప్రకటించాల్సి ఉంది. కూటమిలోని జేడీయూ 48 మందితో జాబితాను ప్రకటించింది. మరోవైపు JSP 51 స్థానాలకు, ఆమ్ ఆద్మీ పార్టీ 59 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి.