News July 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 11, 2024

TODAY HEADLINES

image

* గ్రూప్-2, 3 పరీక్షల వాయిదా ప్రచారం నమ్మవద్దు: TGPSC
* తెలంగాణ డీజీపీగా జితేందర్
* RRR భూసేకరణలో పురోగతిపై సీఎం రేవంత్ ఆరా.. రైతులకు ఎక్కువ పరిహారం దక్కేలా చూడాలని ఆదేశం
* ఏపీలో రూ.70వేల కోట్లతో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కారిడర్: CM CBN
* ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయడం లేదు: వైసీపీ
* మూడో టీ20లో జింబాబ్వేపై భారత్ విజయం
* ఆస్ట్రియాలో మోదీ పర్యటన.. ప్రముఖులతో కీలక భేటీలు

News July 11, 2024

మత్స్యకారులకు భృతి.. మంత్రి కీలక ఆదేశాలు

image

AP: గత ప్రభుత్వంలో మత్స్యకారులకు వేట నిషేధిత సమయంలో నిష్పక్షపాతంగా భృతిని ఇవ్వలేదని, అనర్హులకు ఇచ్చారని పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. మత్స్యశాఖపై అధికారులతో ఆయన సమీక్షించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే పరిహారం, లబ్ధిదారులపై రీసర్వే చేసి 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఏటా రూ.10వేలు భృతిని అకౌంట్లో జమ చేసేది.

News July 10, 2024

రెస్టారెంట్‌పై వార్తల్ని ఖండించిన సందీప్ కిషన్

image

సికింద్రాబాద్‌లోని తన <<13600835>>రెస్టారెంట్<<>> ‘వివాహ భోజనంబు’లో ఆహార భద్రతా ప్రమాణాలను పాటించట్లేదన్న వార్తల్ని సందీప్ కిషన్ ఖండించారు. ‘గత 8 ఏళ్లుగా మా రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్నాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు మా కిచెన్‌కు సంబంధించినవి కావు. ఎక్స్పైరీ అయిన బియ్యం మేము వాడలేదు. టేస్ట్ కోసం ఫుడ్‌లో ఎలాంటి పదార్థాల్ని కలపడం లేదు’ అని ఓ ప్రకటన విడుదల చేశారు.

News July 10, 2024

ఉద్యమిస్తున్న తెలంగాణ.. పరిస్థితి మారుతుందా?

image

ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలో ఉద్యమాలు మళ్లీ మొదలయ్యాయి. గ్రూప్-2, DSC పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థులు, నిరుద్యోగులు గత కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి తెలంగాణ ఉద్యమం నాటి పాత రోజులను గుర్తుకుతెస్తోంది. నిరుద్యోగుల ఆందోళనలను పరిష్కరించి ప్రభుత్వం యువతలో శాంతిని నింపుతుందా? లేక పంతానికి పోతే ఈ ఉద్యమాలు మరింత ఉద్ధృతంగా మారుతాయా? అనేది వేచి చూడాలి.

News July 10, 2024

రేపు ట్రిపుల్ ఐటీ అభ్యర్థుల జాబితా విడుదల

image

AP: ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం త్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా రేపు విడుదల కానుంది. ఉదయం 11 గంటలకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఛాన్సలర్ ఆచార్య కేసిరెడ్డి ఈ జాబితా విడుదల చేస్తారు.

News July 10, 2024

హరిదాస్‌పూర్ గురించి మీకు తెలుసా?

image

ఢిల్లీ, ముంబై తర్వాత ప.బెంగాల్‌లోని హరిదాస్‌పూర్ నుంచే ఎక్కువ మంది విదేశీయులు దేశంలోకి వస్తున్నారు. ఈ ఏడాది తొలి 4 నెలల్లో ఢిల్లీ ద్వారా 33.25%, ముంబై ద్వారా 15.31% మంది దేశంలోకి ప్రవేశించగా, హరిదాస్‌పూర్ నుంచి 8.55% మంది వచ్చారు. ఈ ప్రాంతం బంగ్లాదేశ్ బోర్డర్ కావడం, ఇక్కడ దక్షిణాసియాలో అతిపెద్ద ల్యాండ్ పోర్ట్‌తో పాటు పెట్రాపోల్ ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉండటం ఇందుకు కారణాలుగా అధికార వర్గాలు చెబుతున్నాయి.

News July 10, 2024

విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

TG: కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్‌‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈ ఏడాది ఇంటర్ పాసైన విద్యార్థులు అక్టోబర్ 31 వరకు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చంది. గతంలో అప్లై చేసిన వారు 2024-25 విద్యాసంవత్సరం కోసం మరోసారి రెన్యువల్ చేసుకోవాలని సూచించింది. నవంబర్ 15లోగా నోడల్ అధికారి వెరిఫికేషన్ చేస్తారని తెలిపింది. అప్లై చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News July 10, 2024

కాలుష్య నియంత్రణపై ప్రతిరోజూ ఫిర్యాదులు చేయవచ్చు: పవన్ కళ్యాణ్

image

ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి ఆఫీసుల్లో ప్రజలు తమ సమస్యలు తెలియచేసేందుకు, ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రతిరోజూ 2 గంటల నిర్దేశిత సమయం ప్రకటించాలని ఆదేశించారు. దీంతో రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్య ఫిర్యాదుల స్వీకరణ చేపడతామని అధికారులు పవన్‌కు బదులిచ్చారు.

News July 10, 2024

చరిత్ర సృష్టించిన టీమ్‌ఇండియా

image

అంతర్జాతీయ టీ20ల్లో 150 విజయాలు సాధించిన తొలి జట్టుగా టీమ్‌ఇండియా రికార్డు సృష్టించింది. తాజాగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో గెలిచిన అనంతరం ఈ ఘనతను అందుకుంది. భారత్ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్ (142), న్యూజిలాండ్(111), ఆస్ట్రేలియా(105), సౌతాఫ్రికా (104) ఉన్నాయి.