News July 10, 2024
రెస్టారెంట్‌పై వార్తల్ని ఖండించిన సందీప్ కిషన్
సికింద్రాబాద్‌లోని తన <<13600835>>రెస్టారెంట్<<>> ‘వివాహ భోజనంబు’లో ఆహార భద్రతా ప్రమాణాలను పాటించట్లేదన్న వార్తల్ని సందీప్ కిషన్ ఖండించారు. ‘గత 8 ఏళ్లుగా మా రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్నాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు మా కిచెన్‌కు సంబంధించినవి కావు. ఎక్స్పైరీ అయిన బియ్యం మేము వాడలేదు. టేస్ట్ కోసం ఫుడ్‌లో ఎలాంటి పదార్థాల్ని కలపడం లేదు’ అని ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News October 8, 2024
జమ్మూకశ్మీర్‌లో ఈ ఎన్నికలు ప్రత్యేకం: మోదీ
JKలో ఆర్టికల్ 370, 35(A) రద్దు తరువాత మొదటిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రత్యేకం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారీగా నమోదైన ఓటింగ్ ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని ప్రదర్శించిందన్నారు. పార్టీ పనితీరుపై హర్షం వ్యక్తం చేసిన మోదీ ఓటువేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. JK ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తామన్నారు. మెరుగైన ఫలితాలు సాధించిన NCని అభినందించారు.
News October 8, 2024
BIG BREAKING: బీజేపీ సంచలన విజయం
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హరియాణాలో బీజేపీ సంచలన విజయం సాధించింది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టింది. తొలుత కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో దూసుకెళ్లినా క్రమంగా కమలం రేసులోకి వచ్చింది. ఇక అప్పటినుంచి వరుసగా సీట్లు గెలుస్తూ మ్యాజిక్ ఫిగర్ (46) దాటింది. EC లెక్కల ప్రకారం 90 సీట్లకు గాను BJP 46, కాంగ్రెస్ 35 చోట్ల గెలిచాయి. చెరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
News October 8, 2024
బీజేపీని గెలిపించిన 200 రోజుల ముఖ్యమంత్రి
ఎన్నికలకు 200 రోజుల ముందు హరియాణా CMగా బాధ్యతలు చేపట్టిన నాయబ్ సింగ్ సైనీ BJPని అనూహ్యంగా విజయతీరాలకు చేర్చారు. డమ్మీ CM అని ఎన్ని విమర్శలు వచ్చినా BJP ఎన్నికల ప్రచారం మొత్తం ఆయన చుట్టూనే తిరిగింది. ఫలితాలపై ముందుగానే బాధ్యత వహించిన సైనీ ప్రభుత్వ వ్యతిరేకతలోనూ పార్టీని ముందుండి నడిపారు. అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ విజయానికి కారణమయ్యారు.