News July 10, 2024

ఎట్టకేలకు శుభ్‌మన్ గిల్ ఫిఫ్టీ

image

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎట్టకేలకు తిరిగి ఫామ్ అందుకున్నారు. జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్ (66) అర్ధ సెంచరీతో రాణించారు. కాగా గత 10 మ్యాచుల్లో గిల్ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశారు. దీంతో ఆయన ఫామ్‌పై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే ఆయనకు చివరి అవకాశం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.

News July 10, 2024

14 ఉత్పత్తుల సేల్స్ ఆపేసిన పతంజలి

image

తమ సంస్థకు చెందిన 14 ఉత్పత్తుల సేల్స్ నిలిపివేసినట్లు పతంజలి సుప్రీంకోర్టుకు వెల్లడించింది. వీటికి సంబంధించిన యాడ్స్‌ను తొలగించాలని మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు సమాచారం అందించినట్లు తెలిపింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం వీటి లైసెన్స్‌లు క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. శ్వాసరీ గోల్డ్, లిపిడోమ్, మధుగ్రిట్, బీపీగ్రిట్, లివామ్రిత్ అడ్వాన్స్, లివోగ్రిట్ మొదలైన ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి.

News July 10, 2024

మోదీ-పుతిన్ చర్చలు చరిత్రాత్మకం: రష్యా

image

భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన చర్చలు చరిత్రాత్మకమని రష్యా రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ పర్యటనను ఓ గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించింది. మోదీ పర్యటనను యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించిందని, ఇరుదేశాల మధ్య వాణిజ్య విస్తరణ, స్థానిక కరెన్సీలో చెల్లింపులపై చర్చ జరిగినట్లు తెలిపింది. తమ సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను వెనక్కి పంపించే అంశంపై పరిష్కారం లభిస్తుందని పేర్కొంది.

News July 10, 2024

పుణేలో పెరుగుతున్న జికా వైరస్ కేసులు

image

పుణేలో జికా వైరస్ కేసుల సంఖ్య 15కు చేరింది. బాధితుల్లో 8 మంది గర్భిణులు, ఓ 15 ఏళ్ల బాలుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వ్యాధి సోకిన గర్భిణులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు పేర్కొన్నారు. జికా వైరస్‌ సోకిన ఆడ ఎడిస్‌ దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. జ్వరం, దద్దుర్లు, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

News July 10, 2024

గంభీర్ ఆధ్వర్యంలో IND ODI WC సాధిస్తుంది: భరద్వాజ్

image

గతంలో ఫామ్ కోల్పోయిన రోహిత్ శర్మపై గౌతమ్ గంభీర్ విశ్వాసం ఉంచారని ఆయన చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ అన్నారు. ఆ తర్వాత రోహిత్ గొప్ప క్రికెటర్ అయ్యారని గుర్తు చేసుకున్నారు. ‘గౌతీ భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికవడం గర్వంగా ఉంది. ఆటగాళ్ల ప్రతిభను వెలికితీసే సామర్థ్యం ఆయనకు ఉంది. క్రికెట్‌లో దేశ ప్రతిష్ఠను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారు. గంభీర్ ఆధ్వర్యంలో భారత్ ODI WC సాధిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.

News July 10, 2024

BREAKING: యూట్యూబర్ ప్రణీత్ అరెస్ట్

image

వావి వరసలు మరిచిపోయి తండ్రీ కూతుళ్లపై నీచంగా కామెంట్లు చేసిన ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ అరెస్టయ్యాడు. బెంగళూరులో అరెస్ట్ చేసిన HYD పోలీసులు పీటీ వారెంట్‌పై ఇక్కడకు తరలిస్తున్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి అడ్డగోలుగా అతడు చేసిన అసభ్యకర కామెంట్లపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తీవ్ర చర్చలకు దారి తీశాయి. హీరో సాయి తేజ్ దీన్ని <<13584609>>బయటపెట్టడంతో<<>> సీఎం రేవంత్ ఆదేశాలతో HYD పోలీసులు ప్రణీత్‌పై కేసు నమోదు చేశారు.

News July 10, 2024

పీసీబీ దస్త్రాల దహనంపై పోలీసుల విచారణ

image

AP: కృష్ణా జిల్లా పెనమలూరులో పీసీబీ దస్త్రాల దహనం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. విజయవాడ పీసీబీ ప్రధాన కార్యాలయంలో 7 విభాగాల అధికారులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కార్యాలయం నుంచి ఫైల్స్, హార్డ్ డిస్క్‌లు బయటకు వెళ్లడంలో అధికారుల పాత్రపై విచారిస్తున్నారు. కాల్చిన దస్త్రాల్లోని అంశాలు, వాటి ప్రాధాన్యతపై ఆరా తీస్తున్నారు. సిబ్బంది ఇస్తున్న సమాచారాన్ని వాంగ్మూలంగా నమోదు చేస్తున్నారు.

News July 10, 2024

తెలంగాణ డీజీపీగా జితేందర్

image

TG: రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన జితేందర్.. నిర్మల్ ఏఎస్పీగా, బెల్లంపల్లి అదనపు ఎస్పీగా, మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా, విశాఖ రేంజ్ డీఐజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.

News July 10, 2024

సరిహద్దుల్లో 108 కేజీల బంగారం స్వాధీనం

image

భారత్-చైనా సరిహద్దుల్లో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 108.060 కేజీల 108 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో పెట్రోలింగ్ సందర్భంగా నిందితులు పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు.

News July 10, 2024

టాస్ గెలిచిన భారత్.. టీమ్‌లోకి WC విన్నర్లు

image

జింబాబ్వేతో మూడో టీ20లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. జట్టులోకి T20 WC విన్నర్లు శాంసన్, జైస్వాల్, దూబే వచ్చారు.
IND: గిల్, జైస్వాల్, అభిషేక్, శాంసన్, దూబే, రుతురాజ్, రింకూ, సుందర్, బిష్ణోయ్, అవేశ్, ఖలీల్
ZIM: మాధెవెరె, మారుమణి, బెన్నెట్, మయర్స్, రజా, కాంప్‌బెల్, మదాండే, మసకద్జా, ముజరబానీ, చటారా, రిచర్డ్ నగరవ