News July 9, 2024

వామ్మో.. కేవలం ఇద్దరు సింగర్లకే రూ.141కోట్లు ఖర్చు?

image

ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా వివాహ వేడుక గ్రాండ్‌గా జరుగుతోంది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌కు రూ.83కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. ఎంగేజ్మెంట్‌లో లేడీ సింగర్ రిహన్నాకు రూ.58కోట్లు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అంటే కేవలం ఈ ఇద్దరు సింగర్లకే రూ.141కోట్లు ఖర్చు చేశారన్నమాట. వీరితో పాటు మరికొందరు పాప్ సింగర్స్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

News July 9, 2024

ప్రైవేట్ స్కూళ్లకు లబ్ధి చేకూర్చేలా కూటమి ప్రభుత్వం కుట్రలు: YCP

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ, టోఫెల్ విధానాలకు స్వస్తి పలికే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని YCP ఆరోపించింది. ఇంగ్లిష్ మీడియాన్ని తీసేసి తెలుగు మీడియాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తోందని ట్వీట్ చేసింది. ‘ఐబీ, టోఫెల్ విధానాలను ఉపసంహరించుకోవాలని ప్రధానోపాధ్యాయుల రాష్ట్ర సంఘం తీర్మానం చేసింది’ అనే వార్తను షేర్ చేసింది. ప్రైవేట్ స్కూళ్లకు లబ్ధిచేకూర్చేలా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొంది.

News July 9, 2024

వంటగ్యాస్ e-KYCపై కేంద్రం కీలక ప్రకటన

image

వంటగ్యాస్ e-KYC ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్రం గానీ, చమురు సంస్థలు గానీ ఎలాంటి తుది గడువు విధించలేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ స్పష్టం చేశారు. బోగస్ కస్టమర్లను ఏరివేసేందుకు గత 8 నెలల నుంచి ఈ-కేవైసీ ఆధార్ అథెంటికేషన్ ప్రాసెస్ చేపడుతున్నామని తెలిపారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ కస్టమర్ల ఆధార్ వివరాలను నమోదు చేసుకుంటారని లేదా డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లైనా దీన్ని పూర్తి చేసుకోవచ్చన్నారు.

News July 9, 2024

మెట్రో కోచ్‌లు పెంచండి.. ప్రయాణికుల రిక్వెస్ట్

image

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేసేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని నగరవాసులు సీఎం రేవంత్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. రద్దీ భారీగా పెరిగిందని, మెట్రోలో ఇసుకేస్తే రాలనంత జనం ఉంటున్నారంటున్నారు. అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో ఎంత రద్దీగా ఉందో చూడాలంటూ ఫొటోలను షేర్ చేస్తున్నారు. కోచ్‌లు పెంచేలా మెట్రో అధికారులను ఆదేశించాలని సీఎంను కోరుతున్నారు. మెట్రోలో మీరూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా?

News July 9, 2024

జింబాబ్వే వైల్డ్ లైఫ్ టూర్‌లో టీమ్ఇండియా

image

టీ20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమ్ఇండియా ఖాళీ సమయంలో అక్కడి టూరిజాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తోంది. తాజాగా భారత భారత ఆటగాళ్లు వారి కుటుంబాలతో కలిసి జింబాబ్వే వైల్డ్ లైఫ్ టూర్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. వన్యప్రాణులను దగ్గర నుంచి చూసి ప్లేయర్లు అనుభూతి పొందారు. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచుల్లో చెరొకటి గెలవగా రేపు మూడో మ్యాచ్ జరగనుంది.

News July 9, 2024

మోదీ ఓ క్రిమినల్‌ను కౌగిలించుకోవడం బాధేసింది: జెలెన్‌స్కీ

image

రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ను భారత ప్రధాని మోదీ కౌగిలించుకోవడంపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన మోదీ ఒక క్రిమినల్‌ను కౌగిలించుకోవడం చూసి బాధ కలిగిందని అన్నారు. మరోవైపు అదేరోజు రష్యా మిస్సైల్ దాడిలో 37 మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పుకొచ్చారు.

News July 9, 2024

నిఫ్టీ సరికొత్త రికార్డ్

image

ఈరోజు సెషన్‌ను లాభాల్లో కొనసాగిస్తున్న నిఫ్టీ 24,400 మార్క్ తాకి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసింది. 77 పాయింట్ల లాభంతో ప్రస్తుతం 24,397 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 80,260 వద్ద ట్రేడవుతోంది. మారుతీ 6%, ఐటీసీ 2.31% సహా M&M, SBI, బ్రిటానియా షేర్లు చెరో 1% లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది.

News July 9, 2024

బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు భేటీ

image

AP: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలతో పాటు గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో భాగంగా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్‌కు ఆమోదంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

News July 9, 2024

ఫిరాయింపులు ప్రారంభించింది కాంగ్రెస్సే: KTR

image

TG: పార్టీ ఫిరాయింపులను ప్రారంభించిందే కాంగ్రెస్ అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. 2014కి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహించిందన్నారు. తద్వారా ఆయారాం.. గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టిందని విమర్శించారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి BRS నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకుందని ఆయన ఢిల్లీలో మీడియాతో అన్నారు.

News July 9, 2024

సోషల్ మీడియాలో పిల్లల ఫొటోలు పోస్ట్ చేస్తున్నారా?

image

తండ్రీకూతుళ్ల అనుబంధంపై కొందరు యూట్యూబర్లు చేసిన అసభ్య కామెంట్స్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ తెలంగాణ పోలీసులు పలు సూచనలు చేశారు. ‘మీ పిల్లలు, కుటుంబసభ్యుల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. ఫొటోలకు ప్రైవసీ ఏర్పాటు చేసుకోవాలి. కొన్నిసార్లు మీ సన్నిహితులే వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. అప్రమత్తత మన బాధ్యత’ అని Xలో పోస్ట్ చేశారు.