News July 9, 2024

ఘోరం.. ప్రిన్సిపల్‌ను హత్య చేసిన ఇంటర్ విద్యార్థి

image

AP: ఒంగోలుకు చెందిన రాజేశ్ అస్సాంలో దారుణహత్యకు గురయ్యారు. రాజేశ్ అస్సాంలోని శివసాగర్‌లోని ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్‌, లెక్చరర్‌గా చేస్తున్నారు. 11వ తరగతి విద్యార్థికి కెమిస్ట్రీలో తక్కువ మార్కులు రావడంతో పాటు ప్రవర్తన బాలేదని మందలించారు. దీంతో ఆ విద్యార్థి కక్ష పెంచుకున్నాడు. సాయంత్రం ఆయన క్లాసు చెబుతున్న సమయంలో విద్యార్థి కత్తితో రాజేశ్‌పై దాడికి పాల్పడగా ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణించారు.

News July 9, 2024

స్పైస్‌జెట్‌కు మరో ఆర్థిక సంక్షోభం

image

ఆర్థికంగా ఇప్పటికే పీకల్లోతు చిక్కుల్లో ఉన్న స్పైస్‌జెట్ విమానయాన సంస్థకు మరో ఇబ్బంది వచ్చి పడింది. ఆ కంపెనీ రెండున్నరేళ్లుగా ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్‌ జమ చేయడం లేదు. సీఎన్‌బీసీ-టీవీ18 కథనం ప్రకారం.. 11,581మంది ఉద్యోగులకు చివరిగా 2022 జనవరిలో పీఎఫ్ డిపాజిట్ చేసింది. EPFO నోటీసులు జారీ చేయగా, సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది.

News July 9, 2024

ఇవాళ వింబుల్డన్‌లో రసవత్తర పోరు

image

వింబుల్డన్‌లో ఇవాళ రసవత్తర పోరు జరగనుంది. ఇవాళ జరిగే మెన్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సిన్నర్, ఐదో సీడ్ మెద్వెదెవ్ పోటీ పడనున్నారు. మరో మ్యాచులో అల్కరాజ్, పాల్ తలపడనున్నారు. నిన్న రౌండ్ లెవల్ మ్యాచులో రునేపై జకోవిచ్ విజయం సాధించారు. దీంతో ఆయన రేపు క్వార్టర్స్‌లో మినార్‌తో అమితుమీ తేల్చుకోనున్నారు. ముసెట్టి, ప్రిట్జ్ మధ్య మరో మ్యాచ్ జరగనుంది.

News July 9, 2024

ఆ అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి శిక్షణ

image

TG: పోలీస్ శాఖలో ముందస్తు అనుమతితో సివిల్, ఏఆర్, టీజీఎస్పీ విభాగాల్లో శిక్షణకు హాజరుకాని అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. వీరికి శిక్షణ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రైనింగ్ అడిషినల్ డీజీ అభిలాష బిస్త తెలిపారు. ఈ మేరకు జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనరేట్ల సీపీలకు ఆదేశాలు జారీ చేశారు.

News July 9, 2024

50 మండలాల్లో వర్షాభావం

image

AP: వర్షాభావం కారణంగా రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ నెమ్మదించింది. ఏపీలో వానలు అంతంతమాత్రంగానే ఉన్న సంగతి తెలిసిందే. 11 జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే ఎక్కువగా కురిశాయి. 50వరకు మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టులు ఖాళీగా ఉండటంతో సాగుకు ఇబ్బందవుతోందంటున్నారు. గోదావరి డెల్టాలో సాగు ఓ మాదిరిగా ఉండగా, కృష్ణా డెల్టాలో అసలు నారుమళ్లే పోయలేదని చెబుతున్నారు.

News July 9, 2024

ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలంటే..?

image

AP: ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకు వెళ్లి ఆధార్, ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ ఇవ్వాలి. అధికారి నిర్ణయించిన లోడింగ్, ట్రాన్స్‌పోర్ట్ ఫీజును ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి. ఇందుకోసం QR కోడ్‌లు ఏర్పాటు చేశారు. ఇసుక డిపోలు ఉ.6 నుంచి సా.6 వరకు పని చేస్తాయి. స్టాక్ ఉన్నంత వరకు ఎవరు ముందుగా వస్తే వారికే ఇస్తారు. www.mines.ap.gov.in ద్వారా మీ సమీపంలోని ఇసుక డిపో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

News July 9, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ జనగాం, KNR, ఖమ్మం, MBNR, ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, NZMB, రాజన్నసిరిసిల్ల, సూర్యాపేట, WGL జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. నిన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షం కురిసింది.

News July 9, 2024

సిరీస్ సమం చేస్తారా?

image

దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో నేడు భారత్ చివరి T20 ఆడనుంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఓడిపోగా, రెండో మ్యాచ్ SA బ్యాటింగ్ పూర్తయ్యాక వర్షం కురవడంతో రద్దైంది. దీంతో మూడో టీ20లో గెలిచి సిరీస్ సమం చేయాలని హర్మన్ ప్రీత్ సేన చూస్తోంది. రెండు మ్యాచుల్లోనూ భారత బౌలర్లు విఫలమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇవాళ్టి మ్యాచులో మెరుగైన ప్రదర్శన చేసి గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News July 9, 2024

నేను ఈవీఎంను పగలకొట్టలేదు: పిన్నెల్లి

image

AP: పోలింగ్ రోజున తాను అసలు పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రానికి వెళ్లలేదని మాచర్ల మాజీ MLA పిన్నెల్లి పోలీసు కస్టడీలో చెప్పినట్లు తెలుస్తోంది. ‘నేను అసలు అక్కడికి వెళ్లలేదు. ఈవీఎం పగలకొట్టలేదు. నంబూరి శేషగిరిరావు ఎవరో కూడా నాకు తెలీదు. ఆరోజు నా వెంట గన్‌మెన్లూ లేరు’ అని ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. మొత్తం 50 ప్రశ్నలు అడగ్గా.. వాటిలో 30 ప్రశ్నలకు తెలీదనే చెప్పారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

News July 9, 2024

నేడు పాలమూరుకు సీఎం

image

TG: సీఎం రేవంత్ నేడు పాలమూరులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరనున్నారు. కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతారు. మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా పురోగతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ ఇతర నేతలతో చర్చిస్తారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు HYDకు బయలుదేరుతారు.