News July 9, 2024

సిరీస్ సమం చేస్తారా?

image

దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో నేడు భారత్ చివరి T20 ఆడనుంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఓడిపోగా, రెండో మ్యాచ్ SA బ్యాటింగ్ పూర్తయ్యాక వర్షం కురవడంతో రద్దైంది. దీంతో మూడో టీ20లో గెలిచి సిరీస్ సమం చేయాలని హర్మన్ ప్రీత్ సేన చూస్తోంది. రెండు మ్యాచుల్లోనూ భారత బౌలర్లు విఫలమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇవాళ్టి మ్యాచులో మెరుగైన ప్రదర్శన చేసి గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Similar News

News December 5, 2024

పవర్ గ్రిడ్ పతనం.. క్యూబాలో అంధకారం

image

క్యూబాలో పవర్ గ్రిడ్ పతనం కావడంతో అంధకారం అలుముకుంది. దీంతో దేశంలోని పాఠశాలలు, పరిశ్రమలు, హోటళ్లు మూతపడ్డాయి. దేశంలోని లక్షలాది మంద ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక్కసారిగా ఆహారం, నీళ్లు, మందులు, ఇంధనం దొరకక జనం అల్లాడుతున్నారు. ఫోన్లు, ఫ్యాన్లు, టీవీలు మూగబోవడంతో దిక్కుతోచక ఎదురుచూస్తున్నారు. కాగా గ్రిడ్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు ఆ దేశ విద్యుత్‌శాఖ మంత్రి విసెంటే డి లా ఒలెవీ తెలిపారు.

News December 5, 2024

చైనాతో చేతులు కలిపిన నేపాల్

image

చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI)లో భారత పొరుగు దేశం నేపాల్ చేరింది. ఎన్నికల ఫలితాల అనంతరం నేపాల్ ప్రధాని న్యూఢిల్లీకి వచ్చే సంప్రదాయాన్ని పక్కన పెట్టి పీఎం కేపీ ఓలి శర్మ తాజాగా బీజింగ్ వెళ్లారు. సోమవారం నుంచీ అక్కడే ఉంటూ బీఆర్ఐలో చేరే ప్రక్రియపై చర్చలు జరిపారు. తాజాగా ఆ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు నేపాల్ విదేశాంగ కార్యాలయం ప్రకటించింది.

News December 5, 2024

ప్రపంచంలోనే మోదీ తెలివైనోడు: కువైట్ మంత్రి

image

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే తెలివైనవారిలో ఒకరని కువైట్ విదేశాంగ మంత్రి అలీ అల్ యాహ్యా ప్రశంసించారు. తమకు ఎంతో విలువైన భాగస్వామి అని ఆయన కొనియాడారు. ‘నన్ను భారత్‌కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మోదీ ఈ దేశాన్ని ఒక మంచి దశలో ఉంచుతారు. భారత్‌తో మా సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇరు దేశాల సంబంధాలను బలపరిచేందుకు యాహ్యా ఇక్కడికి వచ్చారు.