News July 9, 2024

TODAY HEADLINES

image

* 2029లో షర్మిల ఏపీ సీఎం అవుతారు: రేవంత్
* DSC పరీక్షలు యథాతథం: TG విద్యాశాఖ
* అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఏపీ టెట్ పరీక్షలు
* ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?
* రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం, కందిపప్పు: నాదెండ్ల
* నీట్-యూజీ పేపర్ లీకైన మాట వాస్తవమే: సుప్రీంకోర్టు
* J&Kలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి.. నలుగురు జవాన్లు మృతి
* రష్యాలో ప్రధాని పర్యటన.. పుతిన్‌తో భేటీ

News July 9, 2024

శ్రీలంకతో సిరీస్‌కు రోహిత్, కోహ్లీ దూరం?

image

వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే 3 మ్యాచుల వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నట్లు సమాచారం. ఆయనతో పాటు కోహ్లీ, బుమ్రా తమకు లాంగ్ బ్రేక్ కావాలని బీసీసీఐని కోరినట్లు PTI పేర్కొంది. కేఎల్ రాహుల్ లేదా హార్దిక్ పాండ్యను ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శ్రేయస్, పంత్ తిరిగి వన్డే టీమ్‌లోకి వచ్చే ఛాన్సుందని అంచనా వేసింది.

News July 8, 2024

సచివాలయ వ్యవస్థపై త్వరలో అధ్యయనం: మంత్రి స్వామి

image

AP: తమపై పనిభారం పెరిగిపోతోందని వెలగపూడిలోని సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామిని గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్లు కలిశారు. టెక్నికల్ స్కిల్స్ అధికంగా ఉన్న వారిని స్కూళ్లు, కాలేజీల్లో సాంకేతిక విధుల కోసం వినియోగించుకోవాలని కోరారు. సచివాలయ వ్యవస్థపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, విధివిధానాలు రూపొందిస్తామని మంత్రి వారి విజ్ఞప్తిపై బదులిచ్చారు.

News July 8, 2024

పెళ్లి చేసుకోబోతున్నా.. అమ్మాయి సినీ రంగ వ్యక్తి కాదు: కుల్దీప్

image

త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు టీమ్ ఇండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ వెల్లడించారు. తనను, కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయి తన జీవితంలోకి రావడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొంతకాలంగా తాను బాలీవుడ్ నటితో స్నేహం చేస్తున్నట్లు వస్తున్న రూమర్స్‌ను ఖండించారు. తాను పెళ్లి చేసుకునే యువతి సినీ రంగానికి చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు.

News July 8, 2024

రేపు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు

image

AP: ఉత్తర కోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించి ఉందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, శ్రీసత్యసాయి, YSR, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువులు-గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దని సూచించింది.

News July 8, 2024

వైద్యశాఖలో 40శాతం ఉద్యోగుల బదిలీకి ఛాన్స్: మంత్రి

image

TG: వైద్య, ఆరోగ్యశాఖలోని ఉద్యోగుల సాధారణ బదిలీలపై సమీక్షలో మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉన్న ఉద్యోగుల్లో 40శాతం మంది బదిలీలకు అవకాశం ఉంటుంది. ANMల నుంచి ప్రొఫెసర్ స్థాయి వరకు అన్ని స్థాయిల బదిలీల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. పారదర్శకంగా జరిగేలా కార్యాచరణ రూపొందించాలి’ అని విభాగాధిపతులను మంత్రి ఆదేశించారు.

News July 8, 2024

ఒలింపిక్స్‌లో భారత పతాకధారిగా పీవీ సింధు

image

పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్తున్న భారత బృందానికి చెఫ్ దే మిషన్‌(మొత్తం టీమ్‌కు ఇన్‌ఛార్జ్)గా షూటర్ గగన్ నారంగ్‌ను IOA నియమించింది. ఈయన దేశానికి నాలుగు ఒలింపిక్స్ పతకాలు తీసుకొచ్చారు. చెఫ్ దే మిషన్ బాధ్యతల నుంచి బాక్సర్ మేరీ కోమ్ తప్పుకోవడంతో నారంగ్‌కు అవకాశం వచ్చింది. అలాగే ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత్ తరఫున పతాకధారులుగా షట్లర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ వ్యవహరించనున్నారు.

News July 8, 2024

పీరియడ్స్ సెలవులు.. సుప్రీంకోర్టు ఏమందంటే?

image

మహిళా ఉద్యోగులకు పీరియడ్స్ సెలవులు ఇవ్వడం మంచి నిర్ణయమే అయినా దీనివల్ల వారికి ఉద్యోగావకాశాలు తగ్గిపోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈమేరకు పీరియడ్స్ సెలవులు తప్పనిసరి చేయాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది. అది విధానపర నిర్ణయమని, అందులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. బిహార్‌ ప్రభుత్వం మహిళలకు నెలకు 2 రోజుల పీరియడ్ లీవ్స్ ఇస్తుండగా కేరళ సర్కార్ విద్యార్థినులకు 3 రోజుల సెలవులు ప్రకటించింది.

News July 8, 2024

ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలు విడుదల

image

TG: గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలను TGPSC విడుదల చేసింది. తెలంగాణ విద్యా విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సహా మరికొన్ని విభాగాల్లో అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కాయి. సరైన అభ్యర్థులు లేక 16 ఉద్యోగాలు, కోర్టు కేసులతో 19, వేర్వేరు కారణాలతో మరికొన్ని ఉద్యోగాల భర్తీ నిలిచిపోయింది. ఫలితాల కోసం <>ఇక్కడ <<>>క్లిక్ చేయండి.

News July 8, 2024

‘కల్కి’ సినిమా అద్భుతం: మహేశ్ బాబు

image

‘కల్కి 2898 AD’ సినిమాపై సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ‘సినిమా చూసి మతిపోయింది. అద్భుతంగా ఉంది. నాగ్ అశ్విన్ విజన్‌కు హ్యాట్సాఫ్. అమితాబ్ స్క్రీన్ ప్రజెన్స్‌ను ఎవరూ మ్యాచ్ చేయలేరు. కమల్ ఏ క్యారెక్టర్ చేసినా దానికి ప్రత్యేకత తీసుకొస్తారు. ప్రభాస్ మరో గొప్ప సినిమాను అవలీలగా చేసేశారు. దీపిక ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. వైజయంతి సంస్థకి, మూవీ టీమ్‌కు కంగ్రాట్స్’ అని ట్వీట్ చేశారు.