News July 8, 2024
పీరియడ్స్ సెలవులు.. సుప్రీంకోర్టు ఏమందంటే?
మహిళా ఉద్యోగులకు పీరియడ్స్ సెలవులు ఇవ్వడం మంచి నిర్ణయమే అయినా దీనివల్ల వారికి ఉద్యోగావకాశాలు తగ్గిపోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈమేరకు పీరియడ్స్ సెలవులు తప్పనిసరి చేయాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది. అది విధానపర నిర్ణయమని, అందులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. బిహార్ ప్రభుత్వం మహిళలకు నెలకు 2 రోజుల పీరియడ్ లీవ్స్ ఇస్తుండగా కేరళ సర్కార్ విద్యార్థినులకు 3 రోజుల సెలవులు ప్రకటించింది.
Similar News
News October 14, 2024
సాధారణ వైద్య సేవలు బంద్: వైద్యుల సంఘం
కోల్‌కతాలో నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతుగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు నిలిపివేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్(FAIMA) పిలుపునిచ్చింది. కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగించాలని స్పష్టం చేసింది. బెంగాల్ సీఎం మమత నుంచి తమకు సరైన స్పందన రాకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
News October 14, 2024
ఇప్పుడున్నది పాకిస్థాన్ చరిత్రలోనే అత్యంత చెత్త జట్టు: వాన్
పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్న జట్టు, పాక్ చరిత్రలోనే అత్యంత చెత్త జట్టని తేల్చిచెప్పారు. ‘నాకు తెలిసినంత వరకూ ఇదే అత్యంత వరస్ట్ టీమ్. ఎటువంటి రిస్కులూ లేకుండా ఇంగ్లండ్ చాలా సునాయాసంగా 823 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు రూట్ ప్రత్యేకమైన ఆటగాడు. కచ్చితంగా సచిన్ రికార్డును బద్దలుగొడతాడు’ అని అంచనా వేశారు.
News October 14, 2024
టర్కిష్ ఎయిర్‌లైన్స్‌పై తాప్సీ ఆగ్రహం
టర్కిష్ ఎయిర్ లైన్స్‌పై హీరోయిన్ తాప్సీ ఫైర్ అయ్యారు. విమానం ఆలస్యంపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘విమానం 24 గంటల ఆలస్యం అనేది మీ సమస్య. ప్రయాణికుల సమస్య కాదు. కస్టమర్ కేర్ సర్వీస్ కూడా అందుబాటులో లేదు. దీంతో తోటి ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడ్డారు’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా ఇటీవల శృతి హాసన్ కూడా ఇండిగో సంస్థపై మండిపడిన సంగతి తెలిసిందే.