News July 8, 2024

YELLOW ALERT.. భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News July 8, 2024

‘స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటుపై సీఎం రేవంత్ ఆదేశాలు

image

TG: స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. దీనిని గచ్చిబౌలి ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ESCIలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలించిన అనంతరం పారిశ్రామిక ప్రముఖులతో CM చర్చలు జరిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగావకాశాలు లభించేలా వర్సిటీలో కోర్సులు ఉండాలని సూచించారు.

News July 8, 2024

‘హరోమ్‌హర’లో ప్రణీత్.. క్షమాపణలు చెప్పిన హీరో

image

పిల్లలపై అసభ్యకర కామెంట్స్ చేసిన యూట్యూబర్‌ <<13586460>>ప్రణీత్<<>> హనుమంతు తన సినిమా ‘హరోమ్‌హర’లో నటించినందుకు చింతిస్తున్నట్లు హీరో సుధీర్ బాబు తెలిపారు. చిత్రయూనిట్‌ తరఫున తాను క్షమాపణలు చెబుతున్నట్లు X వేదికగా ప్రకటించారు. ఇతను ఇంతటి నీచమైన వ్యక్తి అని తమకు తెలియదని పేర్కొన్నారు. వీరి కామెంట్స్ ఏ మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి రావని స్పష్టం చేశారు.

News July 8, 2024

అలా అయితే రీ-నీట్‌కు ఆదేశిస్తాం: సుప్రీం

image

నీట్ పవిత్రతను NTA దెబ్బతీసిందని రుజువైనా, నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా రీ-టెస్ట్‌కు ఆదేశిస్తామని పేపర్ లీకేజీపై విచారణ సందర్భంగా SC స్పష్టం చేసింది. ‘లీకైన పేపర్ వైరల్ చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. ముందు పేపర్ ఎలా లీకైంది? ఎంతమందికి చేరింది? ఎలా చేరింది? లీకేజీతో లబ్ధిపొందిన విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారనే ప్రశ్నలకు సమాధానాలు కావాలి’ అని వ్యాఖ్యానించింది.

News July 8, 2024

ఎంతో ముఖ్యమైన క్యాచ్ 8 ఏళ్ల క్రితమే పట్టేశా: SKY

image

సూర్యకుమార్ యాదవ్ ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. టీ20 WC విన్నింగ్ క్యాచ్‌ను తన వైఫ్‌తో పోల్చారు. ‘స్టన్నింగ్ క్యాచ్ పట్టి నిన్నటికి 8 రోజులవుతోంది. కానీ అత్యంత ముఖ్యమైన క్యాచ్‌ను నిజానికి నేను 8 ఏళ్ల క్రితమే పట్టేశాను’ అని పేర్కొన్నారు. తన భార్య దేవిషా శెట్టి పరిచయమై 8 ఏళ్లవుతోందని ఇలా చెప్పుకొచ్చారు. కాగా T20 WC-2024 ఫైనల్స్‌లో చివరి ఓవర్‌లో SKY అద్భుత క్యాచ్ పట్టిన సంగతి తెలిసిందే.

News July 8, 2024

శ్రీలంక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య

image

శ్రీలంక క్రికెట్ టీమ్‌కు తాత్కాలిక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య నియమితులయ్యారు. ఇప్పటినుంచి సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌ పర్యటన వరకూ ఆయన కోచ్‌గా కొనసాగుతారని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటివరకు ఆయన ఆ జట్టుకు ఫుల్ టైమ్ క్రికెట్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. శ్రీలంకకు 445 ODI, 110 టెస్టులు, 31 T20ల్లో ప్రాతినిధ్యం వహించిన ఆయన మొత్తం 21,032 రన్స్ చేశారు. ఇందులో 42 సెంచరీలున్నాయి.

News July 8, 2024

కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా

image

BRS MLC కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణను వాయిదా వేసింది. వచ్చే గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని CBIని ఆదేశించింది. కవితపై గతంలో దాఖలు చేసిన ఛార్జ్‌షీటులో తప్పులున్నందున మరోసారి ఫైల్ చేస్తామని CBI గతంలో చెప్పింది. ఇటీవల రీఫైలింగ్ చేసిన ఛార్జ్‌షీటులో కూడా తప్పులున్నట్లు కవిత లాయర్లు ఫిర్యాదు చేయడంతో సీబీఐకి కోర్టు నోటీసులిచ్చింది.

News July 8, 2024

మణిపుర్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మణిపుర్‌లో పర్యటిస్తున్నారు. జిరిబామ్, చురాచాంద్‌పూర్ జిల్లాల్లోని రిలీఫ్ క్యాంపులను సందర్శించారు. హింసాత్మక ఘటనల్లో నష్టపోయిన బాధితులను పరామర్శించారు. అంతకుముందు అస్సాంలోని కాచార్ జిల్లాలో వరద బాధితుల్ని కలుసుకున్న ఆయన, వారికి వెంటనే సహాయం అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

News July 8, 2024

ఉచిత ఇసుక: టన్ను రూ.1,394.. ఫ్లెక్సీలు వైరల్

image

AP: రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం ఇవాళ అమల్లోకి వచ్చింది. అయితే నర్సీపట్నం ఇసుక డిపో వద్ద టన్ను రేటు రూ.1,225, విశాఖ అగనంపూడి వద్ద ధర రూ.1,394 అని ఉన్న ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఉచిత ఇసుక అని చెప్పి ఇంత రేటా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రి నుంచి ఇసుక తీసుకురావాల్సి ఉన్నందున ఈ రేటు ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

News July 8, 2024

ఆర్మీ వాహనంపై టెర్రరిస్టుల దాడి

image

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కథువాలో ఆర్మీ వాహనంపై దాడి చేశారు. కొండ పైనుంచి వెహికల్‌పై కాల్పులు జరిపి, గ్రెనేడ్స్ వేయడంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిన్న కుల్గాంలో సైన్యం, టెర్రరిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఆరుగురు ముష్కరులు చనిపోయారు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.