News July 8, 2024

మట్టి వినాయకులను పూజించండి: పవన్

image

AP: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయకచవితికి మట్టి గణపతులనే పూజించాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సూచించారు. ‘మట్టి గణపతులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రయోగాత్మకంగా పిఠాపురంలో మట్టి వినాయకులను పూజించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్‌తో కాకుండా చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడాలి’ అని తనను కలిసిన పర్యావరణ ప్రేమికుడు విజయ రామ్‌తో పవన్ వ్యాఖ్యానించారు.

News July 8, 2024

ఏపీ టెట్ షెడ్యూల్‌లో మార్పులు

image

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. జులై 2న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ జరగాల్సి ఉండగా, ఆ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని తెలిపింది. ప్రిపరేషన్‌కు సమయం కోసం అభ్యర్థుల వినతి మేరకు సవరణ నోటిఫికేషన్‌ను ఇవాళ రిలీజ్ చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

News July 8, 2024

ఏపీ టెట్ కొత్త షెడ్యూల్‌ ఇదే..

image

✒ పరీక్ష ఫీజు చెల్లింపు: ఇప్పటికే ప్రారంభం కాగా ఆగస్టు 3 వరకు అవకాశం
✒ ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఆగస్టు 3 వరకు
✒ ఆన్‌లైన్‌ మాక్‌టెస్ట్‌: సెప్టెంబర్‌ 19 నుంచి
✒ పరీక్షలు: అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు(2 సెషన్లలో)
✒ ప్రొవిజినల్‌ కీ: అక్టోబర్‌ 4నుంచి
✒ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్‌ 5 నుంచి
✒ తుది కీ విడుదల: అక్టోబర్‌ 27
✒ ఫలితాలు విడుదల: నవంబర్‌ 2న

News July 8, 2024

స్మృతి మంధాన లవర్ ఇతనే..

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో రిలేషన్‌ను మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్ఛల్‌ అధికారికంగా ప్రకటించారు. తమ ప్రేమ బంధానికి ఐదేళ్లు పూర్తయ్యాయని తెలుపుతూ వారిద్దరూ కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ పోస్ట్‌కు మంధాన లవ్ సింబల్స్‌తో కామెంట్ చేసింది. కాగా స్మృతి, పలాష్ పలుమార్లు కలిసి కనిపించినా తమ బంధంపై ఎప్పుడూ నోరువిప్పలేదు.

News July 8, 2024

జంగా కృష్ణమూర్తికి హైకోర్టులో ఊరట

image

AP: మండలి ఛైర్మన్ తనపై అనర్హత వేటు వేయడాన్ని జంగా కృష్ణమూర్తి హైకోర్టులో సవాల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఛైర్మన్ వ్యవహరించారని ఆయన తరఫు లాయర్ న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయొద్దని ఈసీకి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కృష్ణమూర్తి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

News July 8, 2024

చంద్రబాబును విమర్శిస్తే వదిలిపెట్టం: సోమిరెడ్డి

image

AP: తెలుగు రాష్ట్రాల గత CMలు జగన్, కేసీఆర్.. ప్యాలెస్, ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైరయ్యారు. ఇప్పటి CMలు చంద్రబాబు, రేవంత్ ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సమావేశమయ్యారని తెలిపారు. వీరి భేటీపై మాజీ మంత్రి కాకాణి విమర్శలు సరికాదన్నారు. ఇంకోసారి CBNను విమర్శిస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. జగన్ నియంతలా వ్యవహరించారని, ఆయన పాలన కర్ఫ్యూను తలపించిందని దుయ్యబట్టారు.

News July 8, 2024

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఈరోజు ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్ 36 పాయింట్ల నష్టంతో 79,960 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 24,320 (-3.30) వద్ద ట్రేడింగ్ ముగించింది. FMCG, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ 0.6-1.5% వృద్ధి చెందాయి. అయితే ఆటో, బ్యాంకింగ్, హెల్త్ కేర్, మెటల్, రియల్టీ, పవర్, టెలికాం రంగాలు 0.4-0.8% క్షీణించడం మార్కెట్‌పై ప్రభావం చూపింది.

News July 8, 2024

‘నీట్’పై విచారణ గురువారానికి వాయిదా

image

‘నీట్’ పేపర్ లీకేజీపై విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఇవాళ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘పేపర్ లీకైన మాట వాస్తవమే. లీకేజీతో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అధికారులు అంటున్నారు. కానీ ఎంతమందికి చేరిందన్నది గుర్తించలేదు. అన్నీ జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తాం’ అంటూ విచారణను వాయిదా వేసింది.

News July 8, 2024

రేపటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన?

image

తెలంగాణ సీఎం రేవంత్ రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. తొలుత తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో పర్యటించాలని ఆయన నిర్ణయించారట. రేపు ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సీఎం అయ్యాక తొలిసారి జిల్లాల పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.

News July 8, 2024

హిండెన్‌బర్గ్ వివాదం.. దర్యాప్తు చేపట్టిన కోటక్!

image

కింగ్‌డన్ క్యాపిటల్ తమ సంస్థ వేదికగా అదానీ షేర్ల షార్ట్ సెల్లింగ్‌కు పాల్పడటంపై కోటక్ గ్రూప్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. హిండెన్‌బర్గ్‌తో కింగ్‌డన్‌కు సంబంధాలు ఉన్నాయని ముందే తెలిస్తే అసలు FPI అకౌంట్‌నే ఓపెన్ చేసే వాళ్లము కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కింగ్‌డన్ ఉద్దేశపూర్వకంగానే ఈ విషయం దాచిందని అనుమానిస్తున్నాయి. ఇందుకు ఆధారాలు లభిస్తే కోటక్ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.