News July 8, 2024
మట్టి వినాయకులను పూజించండి: పవన్
AP: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయకచవితికి మట్టి గణపతులనే పూజించాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సూచించారు. ‘మట్టి గణపతులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రయోగాత్మకంగా పిఠాపురంలో మట్టి వినాయకులను పూజించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్‌తో కాకుండా చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడాలి’ అని తనను కలిసిన పర్యావరణ ప్రేమికుడు విజయ రామ్‌తో పవన్ వ్యాఖ్యానించారు.
Similar News
News October 7, 2024
Aiతో తెలుగు రాష్ట్రాల్లో 122M స్పామ్ కాల్స్ బ్లాక్: AIRTEL
స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు Airtel నెట్‌వర్క్‌లో <<14250922>>ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్<<>>ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత నెల 27 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీతో వినియోగదారులకు స్పామ్ కాల్స్ బెడద గణనీయంగా తగ్గింది. ఈ పదిరోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 122 మిలియన్ల స్పామ్ కాల్స్, 2.3M మెసేజ్లను బ్లాక్ చేసినట్లు AIRTEL తెలిపింది. ఈ ఫీచర్ ప్రతీ యూజర్‌కు అందుబాటులో ఉందని పేర్కొంది.
News October 7, 2024
ఊరెళ్లే వారికోసం ప్రత్యేక బస్సులు: TGSRTC
దసరాకు ఊరెళ్లేవారికి TGSRTC గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 6304 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రద్దీ నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకు మరో 600 స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బంది పడొద్దని, ఆర్టీసీలో సురక్షితంగా వెళ్లాలని సంస్థ ఎండీ సజ్జనార్ సూచించారు.
News October 7, 2024
మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ
ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. విశాఖ స్టీల్ ప్లాంటును రక్షించేందుకు అవసరమైన చర్యలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు, విజయవాడలోని బుడమేరు వాగు ప్రక్షాళన, వరద నష్టంపై చర్చించినట్లు తెలుస్తోంది.