News July 7, 2024

భారత్ టార్గెట్ 178 రన్స్

image

రెండో టీ20లో సౌతాఫ్రికా మహిళల జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 రన్స్ చేసింది. ఓపెనర్ బ్రిట్స్(52) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా అన్నెకె(40), లారా(22), కాప్(20) రాణించారు. భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్, దీప్తి శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. 3 T20ల సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ భారత్ గెలిచి తీరాలి. తొలి మ్యాచ్‌ SA గెలిచింది.

News July 7, 2024

నన్ను అంతా అపార్థం చేసుకున్నారు: ఇషాన్

image

BCCI కాంట్రాక్టు కోల్పోవడంపై భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ తొలిసారి స్పందించారు. ‘నేను పరుగులు చేస్తున్నా బెంచ్‌లో కూర్చోబెట్టారు. నేనెంతో అలసిపోయాను. అందుకే కాస్త విరామం తీసుకోవాలనుకున్నా. అయితే నా నిర్ణయాన్ని నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ మినహా ఎవరూ అర్థం చేసుకోలేదు’ అని కిషన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా తాము ఆదేశించినా అతడు దేశవాళీ క్రికెట్ ఆడలేదన్న కారణంతో BCCI ఇషాన్‌పై వేటు వేసింది.

News July 7, 2024

కొత్త చట్టం కింద MPపై కేసు నమోదు

image

TMC MP మొయిత్రాపై కొత్త క్రిమినల్ చట్టం కింద కేసు నమోదైంది. జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మపై అవమానకరంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే కారణంతో BNS సెక్షన్79 కింద కేసు నమోదైంది. ఇటీవల హాథ్రస్‌‌కు వెళ్లినప్పుడు తనకు ఓ వ్యక్తి గొడుగు పట్టగా రేఖాశర్మ ఖాళీ చేతులతో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోపై మొయిత్రా స్పందిస్తూ ‘ఆమె తన ఓనర్ పైజామాను పట్టుకోవడంలో చాలా బిజీగా ఉంది’ అని అన్నారు.

News July 7, 2024

అసంపూర్తి ప్రాజెక్టులపై సీఎం స్పెషల్ ఫోకస్

image

TG: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని అర్ధాంతరంగా ఆగిపోయిన 6 సాగునీటి ప్రాజెక్టులపై CM రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వాటిని త్వరగా వినియోగంలోకి తేవాలని నిర్ణయించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. నీలంవాగు, పింప్రి, పాలెంవాగు, మత్తడివాగు, SRSP స్టేజ్-2, సదర్మాట్ ప్రాజెక్టును 2025 మార్చి నాటికి పూర్తిచేయాలని CM ఆదేశించారు.

News July 7, 2024

పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ ఏజెన్సీ: బెస్ట్ ఎంపీగా RRR

image

2019-2024లో ఏపీ ఎంపీల్లో రఘురామ కృష్ణరాజు ఉత్తమ పనితీరు కనబరిచారని ‘పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్’ ఏజెన్సీ తెలిపింది. పార్లమెంటులో హాజరు శాతం, లేవనెత్తిన ప్రశ్నల ఆధారంగా ర్యాంకులను వెల్లడించింది. 100 పర్సంటైల్‌తో రఘురామ టాప్‌ ర్యాంకు సాధించారని పేర్కొంది. ఈ లిస్టులో గల్లా జయదేవ్, వంగా గీత, రామ్మోహన్ తర్వాతి 3 స్థానాల్లో ఉన్నారని తెలిపింది. కాగా 2024 ఎన్నికల్లో RRR ఉండి MLAగా గెలుపొందిన సంగతి తెలిసిందే.

News July 7, 2024

గోదావరికి ‘కొత్త నీరు’

image

AP: భారీ వర్షాలతో గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కొండల నుంచి వరద వస్తుండటంతో రాజమండ్రి బ్రిడ్జి వద్ద గోదావరి ఎరుపెక్కింది. రెండు, మూడు రోజుల క్రితం నీలిరంగులో ఉన్న నది ఎర్రగా మారడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

News July 7, 2024

BREAKING: భారత్ ఘన విజయం

image

రెండో టీ20లో జింబాబ్వేపై భారత్ 100 పరుగుల భారీ తేడాతో గెలిచింది. 235 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆ జట్టును టీమ్ ఇండియా బౌలర్లు 134 పరుగులకే ఆలౌట్ చేశారు. ముకేశ్, అవేశ్ తలో 3, బిష్ణోయ్ 2, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు. అంతకుముందు అభిషేక్(100), రుతురాజ్(77*), రింకూ(48*) విజృంభించడంతో భారత్ 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది.

News July 7, 2024

రోహిత్ శర్మ వెళ్లాడు.. అభిషేక్ శర్మ వచ్చాడు

image

WC గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే జింబాబ్వేతో రెండో టీ20లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఆ లోటును తీరుస్తాడంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. పైగా రోహిత్ లాగే అభిషేక్ కూడా తొలి సెంచరీ జింబాబ్వేపైనే చేయడం విశేషం. ఇద్దరూ సిక్స్‌తోనే సెంచరీ పూర్తిచేయడం మరో హైలైట్. భవిష్యత్తులో రోహిత్ స్థానాన్ని అభిషేక్ భర్తీ చేస్తారా? కామెంట్ చేయండి.

News July 7, 2024

కారు ఆపితే నా భార్య బతికి ఉండేది.. బాధితుడి ఆవేదన

image

నిందితుడు BMW కారు ఆపి ఉంటే తన భార్య బతికి ఉండేదని <<13583473>>హిట్ అండ్ రన్<<>> ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కావేరి భర్త ప్రదీప్ అన్నారు. నిందితులు పెద్ద వాళ్లని, వారిని ఎవరూ ఏం చేయలేరని ఆవేదన వ్యక్తం చేశారు. చేపలు విక్రయిస్తూ జీవనం సాగించే ఈ దంపతులు బైక్‌పై వెళుతుండగా శివసేన నేత కుమారుడు కారుతో ఢీకొట్టడంతో భార్య కావేరి మరణించారు. కాగా నిందితుడు మద్యం తాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

News July 7, 2024

జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

image

AP: రాష్ట్రంలోని NDA సర్కార్‌కు జనసేన శ్రేణులు వెన్నుదన్నుగా నిలబడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పార్టీ రూల్స్‌ను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేసినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనడం కూడా నిబంధనల అతిక్రమణ కిందికే వస్తుందని, అలాంటి వారిపైనా చర్యలు ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపారు.