News July 7, 2024

ద్రవిడ్‌కు భారతరత్న ఇవ్వాలి: గవాస్కర్

image

భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు భారతరత్న ఇవ్వాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆటగాడిగా, కెప్టెన్‌గా, నేషనల్ క్రికెట్ అకాడమీ ఛైర్మన్‌గా, కోచ్‌గా ఆయన భారత క్రికెట్‌కు అందించిన సేవలకు ప్రభుత్వం భారతరత్నతో సత్కరించాలని సన్నీ అభిప్రాయపడ్డారు. కాగా క్రీడారంగంలో ఈ పురస్కారం పొందిన ఏకైక వ్యక్తిగా సచిన్ ఉన్నారు.

News July 7, 2024

అర్హత సాధించని అభ్యర్థులు నిరుత్సాహపడొద్దు: సీఎం

image

TG: గ్రూప్-1 మెయిన్స్‌కు అర్హత సాధించని అభ్యర్థులు నిరుత్సాహపడొద్దని సీఎం రేవంత్ సూచించారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకొని, విజయం సాధించేవరకు ప్రయత్నాన్ని విరమించనివారు ఎప్పటికైనా విజయతీరాలకు చేరతారని అన్నారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన 31,382 మంది అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తుది పరీక్షలో విజయం సాధించాలని సీఎం ఆకాంక్షించారు.

News July 7, 2024

T20 WC: ఐసీసీ ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డు బ్రేకింగ్ వ్యూస్

image

టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత తమ డిజిటల్ ఛానల్స్‌లో రికార్డు బ్రేకింగ్ వ్యూస్ వచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది. 24 గంటల్లో అన్ని వేదికల్లో కలిపి 1.3 బిలియన్ వ్యూస్ సాధించినట్లు తెలిపింది. భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన ఈ ఫైనల్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొంది. జూన్ 29న జరిగిన ఉత్కంఠ పోరులో టీమ్‌ఇండియా 7 రన్స్ తేడాతో గెలిచి WCని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

News July 7, 2024

భవిష్యత్‌లో హార్దిక్ స్థానాన్ని భర్తీ చేస్తా: నితీశ్

image

భారత జట్టులో తనకు తప్పకుండా చోటు దక్కుతుందని నితీశ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆల్‌రౌండర్‌గా భవిష్యత్‌లో హార్దిక్ స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఆరు లేదా ఏడో ప్లేస్‌లో బ్యాటింగ్ చేయగలనన్నారు. టీమ్‌కు ఓపెనర్ అవసరం లేదని, ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నారు. జింబాబ్వే సిరీస్‌కు నితీశ్ ఎంపికైనప్పటికీ గాయంతో తప్పుకున్న విషయం తెలిసిందే.

News July 7, 2024

రేషన్‌కార్డులు ఉన్న వారికి BIG ALERT

image

TG: రేషన్‌కార్డుల్లో పేర్ల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే సవరణలు, పేర్ల నమోదుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. ఎడిట్ ఆప్షన్ ప్రక్రియ మొదలైందనే వాట్సాప్‌లలో ఫేక్ వార్తలు రావడంతో ప్రజలు రాష్ట్రంలోని మీ సేవా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.

News July 7, 2024

KCR ప్రధాని అవ్వాలని కలలు కన్నారు: జూపల్లి

image

TG: రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలిచి KCR ప్రధాని కావాలని కలలు కన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. HYDలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన.. మాజీ CM సరిగ్గా పరిపాలిస్తే కాంగ్రెస్‌కు ప్రజలు ఎందుకు అధికారం కట్టబెట్టారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతోనే BRSకు ప్రజలు బుద్ధి చెప్పారని మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు.

News July 7, 2024

మాతో టచ్‌లో 26 మంది MLAలు: బండి సంజయ్

image

TG: తమతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. కానీ వారంతా బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేయాలని, అందుకే వారు పార్టీలోకి రావడానికి తర్జనభర్జన పడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుని బీఆర్ఎస్ ఏ తప్పైతే చేసిందో కాంగ్రెస్ కూడా అదే తప్పు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

News July 7, 2024

నా మాటలను మరోలా అర్థం చేసుకున్నారు: కమల్

image

భారతీయుడు-2 కంటే మూడో పార్ట్ బాగా నచ్చిందని తాను చేసిన వ్యాఖ్యలను కొందరు మరోలా అర్థం చేసుకున్నారని కమల్ హాసన్ చెప్పారు. ‘మూడో భాగం బాగుందన్నా.. అలా అని రెండో పార్ట్ బాగాలేదని కాదు. సాంబారు, రసంతో భోజనాన్ని ఇష్టంగా తింటాం. పాయసం ఉంటే మరింత ఆసక్తి చూపుతాం. అలాగే పలు అంశాల్లో భారతీయుడు-3 నన్ను ఆకట్టుకుంది. నా కెరీర్‌లో ఇండియన్ సీక్వెల్ కోసమే ఎక్కువ కష్టపడ్డా’ అని పేర్కొన్నారు.

News July 7, 2024

ప్రభాస్ పెళ్లిపై శ్యామలా దేవి కీలక వ్యాఖ్యలు

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘బాహుబలి తర్వాత ప్రభాస్‌కు సినిమాల్లో విజయం దక్కదని కొందరు అన్నారు. కానీ ఇప్పుడు కల్కితో సక్సెస్ అందుకున్నారు. అలాగే ఆయన పెళ్లి విషయంలోనూ ఇదే జరుగుతుంది. ప్రభాస్ చాలా గొప్ప వ్యక్తి. ఆయనకు పెళ్లి చేయాలని మాకూ ఉంటుంది. ఆ సమయం రాగానే వివాహం జరిగి తీరుతుంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.

News July 7, 2024

స్టాగ్ బీటిల్.. ఈ పురుగు ఖరీదు రూ.75 లక్షలు!

image

అరుదైన జంతువులు, పక్షులకు రూ.లక్షలు వెచ్చించడం చూశాం. ఓ స్టాగ్ బీటిల్ అనే అత్యంత అరుదైన పురుగు రేటు రూ.75 లక్షలు. విదేశాల్లో కొందరు దీన్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారట. ఓవర్‌నైట్ కోటీశ్వరులను చేస్తుందని నమ్మకం. కొన్ని చికిత్సల్లోనూ వాడతారు. అందుకే బిలియనీర్లు అంత ధర వెచ్చిస్తారు. ఇవి ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లోనే జీవిస్తాయి. 2-6 గ్రాముల బరువు, 37-70MM పొడవు ఉంటాయి. జీవితకాలం 3-7ఏళ్లు.